‘కార్మికుల పిల్లలపై దాడి హేయం’
Published Thu, Sep 1 2016 11:05 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
బెల్లంపల్లి : నిరుద్యోగులైన కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశ పెట్టి నిలదీసినందుకు టీబీజీకేఎస్ శ్రేణులు వారిపై దాడి చేయడం హేయమైన చర్య అని తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) జిల్లా అ«ధ్యక్షుడు శ్రీమన్నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆడెపు సమ్మయ్య, కార్యదర్శి దేవిసత్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చి ఆ తర్వాత పట్టింపు లేకుండా టీబీజీకేఎస్ నాయకులు తిరుగుతున్నారని పేర్కొన్నారు. సభలో కార్మికుల పిల్లలు నిలదీయడంతో గొడవకు దిగి విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు. ఈ దాడిలో సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్ తలకు బలమైన గాయాలు తగిలాయని పేర్కొన్నారు. కార్మికుల పిల్లలపై చేసిన భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మిక పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Advertisement