- నల్లబ్యాడ్జీలు ధరించిన సింగరేణి సన్స్
వారసత్వ ఉద్యోగాల కోసం నిరసన
Published Tue, Aug 16 2016 6:42 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
శ్రీరాంపూర్ : వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం అసోసియేషన్ నాయకులు ఎస్సార్పీ 1 గనిపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ డివిజన్ ఇన్‌చార్జి ఎన్. మహేశ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే వారసత్వ ఉద్యోగాలు ప్రకటించాలన్నారు.
అన్ని కార్మిక సంఘాలు వారసత్వ ఉద్యోగాల కోసం పోరాడాలని కోరారు. దీని కోసం సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే జాప్యం వల్ల సర్వీసు కోల్పోయి చాలా మంది ఉద్యోగాలు కల్పించిన ఉద్యోగాలు రాకుండాపోతున్నాయని తెలిపారు. ఎలాంటి సర్వీసు నిబంధనలు లేకుండా దరఖాస్తు చేసుకున్న వారందరికీ వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఓట్ల కోసం కార్మికుల సంఘాలు తమ డిమాండ్‌ను వాడుకుంటున్నాయని తప్ప తమ ఉద్యోగాల పట్ల వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలు సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌కు చెందిన నరేశ్, రాజేందర్, దిలీప్, సందీప్, సాగర్, విజయ్, అనిల్ పాల్గొన్నారు.
Advertisement