dependent jobs
-
‘వారసత్వం’పై ఉత్కంఠ
సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం జరగనున్న సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వారసత్వ ఉద్యోగాలు పొందేందుకుగల అర్హతలు, ఇతర బెనిఫిట్స్‌పై కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు. హైదరాబాద్‌లో యాజమాన్యంతో గురువారం జరిగిన చర్చల్లో గుర్తింపు కార్మిక సంఘం నేతలు షరతుల్లేని వారసత్వం కోసం పట్టుబట్టారు. ♦ రాజధానిలో సింగరేణి కార్మిక సంఘం నేతల లాబీయింగ్ ♦ షరతులు లేని విధానం అమలు చేయాలని పట్టు ♦ రెండేళ్ల సర్వీస్ విధానాన్ని పునరుద్ధరిస్తామంటున్న సంస్థ ♦ నేడు బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం గోదావరిఖని(పెద్దపల్లి): సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం జరగనున్న సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వారసత్వ ఉద్యోగాలు పొందేందుకుగల అర్హతలు, ఇతర బెనిఫిట్స్‌పై కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనేపథ్యంలో సింగరేణి అధికారిక గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు బి.వెంకట్రావు, కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, కనకరాజు, సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవితతోపాటు ఇతర ప్రభుత్వ పెద్దలు, సింగరేణి యాజమాన్యంతో గురువారం విడివిడిగా సమావేశమయ్యారు. బోర్డుసమావేశాన్ని ప్రభావితం చేయగలరని భావిస్తున్న ముఖ్యమైన అధికారులు, ప్రభుత్వ పెద్దలతో లాబీయింగ్ జరుపుతూ తమవాదన వినిపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు పొందేహక్కును కార్మికులకు కల్పించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. రెండేళ్ల సర్వీస్ నిబంధన వద్దు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, ఇతర డైరక్టర్లతో విడివిడిగా సంఘం నాయకులు సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 1998లో అప్పటి ప్రభుత్వం రద్దుచేసిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తారనే ఆశతో కార్మికలోకం ఉందని, ఆంక్షలతో కూడిన ఉద్యోగాలకు కార్మికులు ఒప్పుకోవడంలేదని వారికి వివరించారు. ‘ఎలాంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను సింగరేణి యాజమాన్యం పాటించేలా చూడాలని విజ్ఞప్తిచేశారు. 1998 కన్న ముందున్న విధానంలో రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగుల కుమారులు, అల్లుళ్లకు మాత్రమే ఉద్యోగాలు లభించే ఆస్కారం ఉందని, తద్వారా సుమారు ఏడు వేల మంది కార్మికులు నష్టపోతారని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి ఆంక్షలు విధించడమేనని స్పష్టంచేశారు. బోర్డు సమావేశంలో ఒకరోజు ముందు పదవీ విరమణ చేసే కార్మికుడికి కూడా వారసత్వ ఉద్యోగాలు వర్తించేలా విధివిధానాలు రూపొందించాలని కోరారు. రెండేళ్ల సర్వీస్ వదిలిపెట్టాలనే నిబంధనలు విధిస్తే సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల్లో 48 నుంచి 58 సంవత్సరాల వయస్సు మధ్య సుమారు 30 వేల మందికి ఈ పథకం వర్తించే అవకాశముంది. 1981 నాటి చట్టానికే యాజమాన్యం మొగ్గు? సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకుల వాదనను సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత బలపరచగా, సింగరేణి యాజమాన్యం మాత్రం సంసిద్ధత వ్యక్తం చేయనట్లు తెలిసింది. 1981లో రూపొందించిన వారసత్వ ఉద్యోగాల కల్పన(రెండేళ్ల సర్వీసు నిబంధన)చట్టాన్ని కాదని, అందరికీ ఉద్యోగాలు కల్పించేలా విధివిధానాలను రూపొందిస్తే న్యాయపరమైన అడ్డంకులు వచ్చే అవకాశం ఉందని సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. 1998లో పక్కనబెట్టిన వారసత్వ ఉద్యోగాల కల్పన చట్టం–1981ని పునరుద్ధరించడం ద్వారా న్యాయపరంగా సమస్యలు రావని అభిప్రాయపడ్డట్టు సమాచారం. బోర్డు సమావేశంలో కోల్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ ఇంధన మంత్రిత్వ శాఖల నుంచి వచ్చే ప్రతినిధులు షరతులు లేని వారసత్వ ఉద్యోగాలకు అంగీకరించకపోవచ్చని కూడా చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని కార్మిక నేతలు ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో శుక్రవారం జరిగే బోర్డు సమావేశం కీలకం కానుంది. నేటి కీలక అంశాలపై నిర్ణయం... వారసత్వఉద్యోగాలతోపాటు పలుఅంశాలపై హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం జరగనున్న బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 2015–16లో సంస్థ సాధించిన రూ.1066కోట్ల లాభాలనుంచి 23శాతం వాటాను కార్మికులకు చెల్లించగా..దీనికిసంబంధించి సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో అవసర నిమిత్తం 15డోజర్ల కొనుగోలు, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కోల్వాషరీస్ ఏర్పాటు, మణుగూరులోని ఓపెన్‌కాస్ట్‌లో కొత్తగా ఓవర్‌బర్డెన్(మట్టి తొలగింపు) కాంట్రాక్ట్‌పై డైరెక్టర్లు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
'వారసత్వం'పై చర్చలు అసంపూర్తి?
గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో విధివిధానాలపై బుధవారం హైదరాబాద్‌లో చర్చలు జరిగాయి. హైదరాబాద్‌లో సీఎం క్యాంపు ఆఫీస్‌లో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, సింగరేణి మాజీ సీఅండ్ఎండీ నర్సింగరావు ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి. ప్రస్తుత సీఅండ్ఎండీ శ్రీధర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్, మాజీ ఎంపీ వివేక్ చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన మేరకు సింగరేణి కార్మికులకు వన్‌టైం సెటిల్మెంట్ కింద కాలపరిమితి విధించకుండా, షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాయకులు సీఎండీని కోరారు. అయితే ఇందుకు ఆయన ససేమిరా అంటూ 1981 నుంచి 1998 వరకు కార్మికుడి రెండేళ్ల సర్వీస్‌ను సంస్థకు వదిలిపెట్టిన వారికే ఈ పథకాన్ని అమలుపర్చారని, ప్రస్తుతం కూడా ఆ విధంగానే వ్యవహరించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సర్వీస్‌తో సంబంధం లేకుండా, షరతులు విధించకుండా వారసత్వ ఉద్యోగాలు ఇస్తే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. ఈ సమావేశంలోనే వీఆర్ఎస్ కార్మికులకు ఉద్యోగావకాశాలపై చర్చించారు. వీఆర్ఎస్ కార్మికుల వారసులకు ఉద్యోగానికి బదులు రూ.2 లక్షలు సంస్థ ముట్టజెప్పిందని, దీనిపై యూనియన్‌తో ఒప్పందం జరిగిందని, అలాగే డిస్మిస్ కార్మికులకు కూడా మూడుసార్లు అవకాశం కల్పించామని, ఇక వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేమని సింగరేణి సీఎండీ స్పష్టం చేసినట్టు తెలిసింది. వారసత్వ ఉద్యోగాల విషయంలో నిర్ణయించే కాలపరిమితిపై మరోసారి ఆలోచించాలని నేతలు కోరారు. గురువారం కూడా ఈ విషయమై మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 4న జరగనున్న సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో విధివిధానాలు ప్రకటించే అవకాశాలున్నాయి. -
హామీలు నెరవేరుస్తున్న టీబీజీకేఎస్
రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు సాధిస్తాం నస్పూర్ : కార్మికులకు ఇచ్చిన హామీలను టీబీజీకేఎస్ యూనియన్ నెరవేరస్తుందని రాష్ట్ర అద్యక్షుడు బి.వెంకట్రావ్ పేర్కొన్నారు. ఆదివారం న స్పూర్ కాలనీ పాత కమ్యూనిటీ హాల్ నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు సింగరేణి కార్మికులంటే ఎంతో అభిమానం ఉందన్నారు. సింగరే ణి కార్మికులు సైనికుల కంటే తక్కువ కాదని దసరా పండుగ కానుకగా కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు, లాభాల ప్రకటించారన్నారు. కార్మికులందరికి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు వచ్చేలా కృషిచేస్తానన్నారు. స్వంత ఇంటిపథకం త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వీఆర్ఎస్ డిపెండెంట్లకు అన్యాయం చేసింది ఏఐటీయూసినే అన్నారు. డిస్మిస్ కార్మికులకు అవకాశం కల్పించడానికి యాజమాన్యంలో చర్చిస్తామని తెలిపారు. వీఆర్ఎస్ కార్మికులను రెచ్చగొట్టి ఆందోళనా కార్యక్రమాలు చేపిస్తున్నారని ఆరోపించారు. ఏఐటీయూసీ నాయకులు ఏం సాధించారని కార్మికుల నుంచి చందాలు వసూలు చేస్తున్నారో కార్మికులు వారిని ప్రశ్నించాలని కోరారు. వారసత్వ ఉద్యోగాలు కార్మికుల వారసులకే కాకుండా సింగరేణేతరుకు కూడా కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ హైకోర్టుకు వెళ్లి కార్మికుల వారసులకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. కార్మికుల పక్షానæ పోరాడుతున్న టీబీజీకెఎస్పై జాతీయ సంఘాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. నేటి నుంచి హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశాల్లో వారసత్వ ఉద్యోగాల విధివిధానాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్మికుల హక్కుల సాధనకోసం పోరాడుతున్న టీబీజీకేఎస్‌ను రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భారీగా చేరికలు శ్రీరాంపూర్ ఏరియాలోని వివిధ గనులకు చెంది న సుమారు 200మంది ఏఐటీయూసీ నాయకు లు కార్యకర్తలు ఆదివారం టీబీజీకేఎస్‌లో చేరా రు. ఆర్కే–7 ఏఐటీయూసీ మాజీ పిట్ కార్యద ర్శి అశోక్‌తోపాటు మరికొంత మంది యూని యన్‌లో చేరారు. యూనియన్‌లో చేరుతున్న నా యకులు కార్యకర్తలకు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డిలు కండువాలను కప్పి యూనియన్‌లోకి ఆహ్వానిం చారు. ఈ సమావేశంలో టీబీజీకెఎస్ కేంద్ర నా యకులు సారంగపాణి, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు కె.సురేందర్‌రెడ్డి, నాయకులు పెద్దపల్లి కోటిలింగం, బంటు సారయ్య, రమేష్, పానుగంటి సత్తయ్య, వీరభద్ర య్య, మల్లారెడ్డి, కానుగంటి చంద్రయ్య, పోశెట్టి, అశోక్, ఎంపీపీ సత్యనారాయణ, సర్పంచులు రాజేంద్రపాణి, శంకర్, కిష్టయ్య పాల్గొన్నారు. -
వారసత్వ ఉద్యోగాలపై చరిత్రాత్మక నిర్ణయం
ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే.. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ రెబ్బెన : 18 ఏళ్లుగా సింగరేణి కార్మికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్‌ది చరిత్రాత్మక నిర్ణయమని టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ అన్నారు. శుక్రవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్‌క్లబ్‌లో టీబీజీకేరియా ఏరియా సర్వసభ్య స మావేశం నిర్వహించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట్రావ్ మాట్లాడుతూ సింగరేణిలో వీఆర్ఎస్ ఉద్యోగాలను రద్దు చేస్తూ జాతీ య సంఘాలు ఒప్పందాలు కుదుర్చుకుందని అన్నా రు. కేవలం కార్మికులు మరణిస్తే, మెడికల్ అన్‌ఫిట్ అ యితే తప్ప కార్మికులకు ఉద్యోగాలు దొరికే పరిస్థితులు లేకుండా పోయాయి. దేశంలో ఎక్కడ లేనివిధంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ రిటైర్ అయ్యే వరకు అందుతుందని తెలిపారు. జాతీయ సంఘాలు పొగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరణకు అంగీకారం తెలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎలాంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలని సీఎండీని ఆదేశించారని తెలిపారు. కమ్యూనిస్టు యూనియన్లను భూస్థాపితం చేయాలి : ఎమ్మెల్సీ సతీశ్ కుమార్ కార్మికులను శ్రమదోపిడీకి గురిచేసే కమ్యూనిస్టు యూ నియన్లను వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ సంఘాలు కార్మికులను ఓట్ల వేసే యంత్రాలుగా మార్చుకుని ఎన్నికల్లో గెలిచిన అనంతరం యాజమాన్యానికి తొత్తులుగా మారుతున్నాయని విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలను కాలరాసిన కమ్యూనిస్టు సంఘాలు ఏ ముఖం పెట్టుకుని కార్మికులను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ను కార్మికులు గెలిపిస్తే ప్రభుత్వ అండతో మరిన్ని హక్కులను సాధిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏరియాకు చెందిన కార్మికులు భారీస్థాయిలో టీబీజీకేఎస్‌లో చేరారు. ఈ సమావేశంలో రెబ్బెన, తాండూర్ జెడ్పీటీసీలు అజ్మీర బాబురావు, సురేష్‌బాబు, రెబ్బెన ఎంపీపీ సంజీవ్‌కుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్ పర్సన్ శంకరమ్మ, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్, కేంద్రకమిటీ కార్యదర్శులు శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ,ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఏరియా కార్యదర్శులు శంకరయ్య, శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు. -
మాకూ ఉద్యోగాలివ్వాలి
ట్యాంకులు, టవర్లు ఎక్కిన వీఆర్ఎస్ డిపెండెంట్లు బెల్లంపల్లి, గోదావరిఖనిలో డిస్మిస్డ్ కార్మికులు సైతం.. సింగరేణి మూడు రీజియన్లలో ఉద్రిక్త పరిస్థితులు గురువారం రాత్రి నుంచే ఆందోళనలు గోదావరిఖని/రుద్రంపూర్/మందమర్రి/బెల్లంపల్లి : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే 1997 నుంచి 2001 వరకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్) ద్వారా ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల్లో రూ. 2లక్షలు కాంపెన్షేషన్ తీసుకోని వారికి సైతం ఉద్యోగావకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తమకు కూడా ఉద్యోగాలి వ్వాలని కాంపెన్షేషన్ పొందిన కార్మికుల వారసులు కం పెనీ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. గోదావరిఖనిలో గురువారం రాత్రి 10.30 గంటలకు డిపెండెంట్లు లక్ష్మారె డ్డి, సతీష్‌యాదవ్, రమేశ్, రామరాజు, రవీందర్, యూ సుఫ్ అశోక్‌నగర్‌లోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి 21 గంటలపాటు అక్కడే ఉన్నారు. సమస్యను సీఎండీ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని శుక్రవారం ఎంపీ బాల్క సుమన్, టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కెంగెర్ల మల్లయ్య ప్రకటించారు. ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌లో మాజీ ఎంపీ జి.వివేక్ సైతం హామీ ఇవ్వడంతో డిపెండెంట్లు ఆందోళన విరమించి కిందకు వచ్చారు. మందమర్రిలో.. మందమర్రిలో 150 మంది వీఆర్ఎస్ డిపెండెంట్లు ఆం దోళనకు దిగారు. కొందరు శుక్రవారం ఉదయం 9.00 గంటలకు యాపల్లోని మున్సిపల్ నీటి ట్యాంక్ ఎక్కా రు. స్పష్టమైన హామీ ఇస్తేనే కిందకు వస్తామని చెప్పడం తో పోలీసులు సైతం మిన్నకుండిపోయారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు నచ్చజెప్పినా వినలేదు. ఎట్టకేలకు సాయంత్రం 8.00 కిందకు దిగి వెళ్లిపోయా రు. అంతకు ముందు వీఆర్ఎస్ నాయకులు రమణాచా రి, శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే తమ బతుకులు బగుపడుతాయని ఆశపడితే ఇప్పుడు తిరకాసుతో అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఎస్ వారసులకు ఉద్యోగాలివ్వకుంటే ప్రత్యక్ష పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వీఆర్ఎస్లు చేస్తున్న ఆందోళ న న్యాయమైనదేనని కాంగ్రెస్ నాయకులు గుడ్ల రమేష్, నూకల రమేష్ వారికి మద్దతు తెలిపారు. ఆందోళనలో వీఆర్ఎస్ డిపెండెంట్లు కోత్తపల్లి రమేష్, సజ్జనపు సదానందం, కూకట్ల తిరుపతి, మెండె భాస్కర్, నాగరాజు, సింగరేణి శ్రీనివాస్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెంలో.. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా వీఆర్ఎస్ డిసెండెంట్లు ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ ఇల్లందుకు చెందిన బద్రునాయక్, సంతోష్, కొత్తగూడెం రామవరంకు చెం దిన చేనెళ్లి రమేష్ బర్మాక్యాంప్లోని రామాలయం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు దిగేది లేదని భీష్మించారు. ఈ సందర్భంగా వీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కలిసికట్టుగా తమకు అన్యా యం చేసిందని, వీఆర్ఎస్, డిపెండెంట్, డిస్మిస్డ్ కార్మికులందరికీ ఒకే దఫా ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. సాయంత్రం 7.00 గంటలకు ఆందోళన విరమించారు. -
వారసత్వం మళ్లీ సొంతం
ముఖ్యమంత్రి ప్రకటనతో కార్మికుడి బిడ్డగా గర్వపడుతున్నా.. ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు ఘన స్వాగతం పలికిన టీబీజీకేఎస్ శ్రేణులు మందమర్రి నుంచి రామకృష్ణాపూర్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ మందమర్రి : ఏళ్లుగా సింగరేణి కార్మికులు ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగ ప్రకటనతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన యావత్తు సింగరేణికి, కార్మికవర్గానికి ఎంతో సంతోషాన్నిచ్చిందని బతుకు నమ్మకాన్ని కలిగించిందని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు అన్నారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన చర్చల్లో పాల్గొని శుక్రవారం సాయంత్రం మందమర్రికి వచ్చిన ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలును టీబీజీకేఎస్ నాయకులు స్థానిక బస్టాండ్ ప్రాంతంలో ఘన స్వాగతం పలికారు. పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సెంటర్‌కు చేరుకోగా, విప్ ఓదేలు కార్మికులను, యూనియన్ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి గత వైభవం తీసుకురావాలనే ఆకాంక్ష బలంగా ఉండేదని తెలిపారు. వలస పాలకుల పాలనలో సింగరేణి ఛిద్రమైందని, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా తనపై ఉందని కేసీఆర్ భావించే వారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రకటించిన వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ ప్రకటనతో సింగరేణి కొంగు బంగారంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి పరిసర ప్రాంత గ్రామాలు, అతిపెద్ద పారిశ్రామిక నగరాలుగా విలసిల్లుతాయని ఆయన తెలిపారు. అనంతరం సుమారు వెయ్యి మోటారు వాహనాలతో భారీ ర్యాలీగా రామకృష్ణాపూర్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, నాయకులు జె.రవీందర్, ఎస్.ప్రభాకర్, కాంపెల్లి సమ్మయ్య, దాసరి రామన్న, లక్ష్మణ్, అన్ని గనుల డిపార్ట్మెంట్ల ఫిట్ కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు. -
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరణ
లాభాల్లో 23 శాతం వాటా.. నేడు చెల్లింపు రూ.2 లక్షలు తీసుకుని డిపెండెంట్లకు ఉద్యోగావకాశాలు విధి విధానాలు ఖరారు చేయాలని సీఎండీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం కోల్‌బెల్ట్‌లో మిన్నంటిన సంబరాలు గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణిలో కొన్నేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అలాగే 1997 నుంచి 2001 వరకు వలం టరీ రిటైర్డ్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) ద్వారా ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల వారసుల నుంచి రూ.2 లక్షలు తీసుకుని వారికి కూడా ఉద్యోగావకాశం క ల్పించనున్నట్లు ప్రకటించారు. 2015 -16లో సాధించిన రూ.1066 కోట్ల లాభాల నుంచి 23 శాతం వాటాను కార్మికులకు చెల్లించేందుకు సీఎం అంగీకరించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత, పెద్దపల్లి, మానుకోట ఎంపీలు బాల్క సుమన్, సీతారాంనాయక్, మాజీ ఎంపీ జి.వివేక్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్‌రా వు, కోరం కనకయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, నాయకులు కెంగర్ల మల్ల య్య, మిర్యాల రాజిరెడ్డి, ఆకునూరి కనకరాజు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 1998 జూన్ 6వ తేదీ నాటికి ఉన్న 1100 మంది డిపెండెంట్లకు ఆనాటి నుంచి మూడేళ్లలో ఉద్యోగాలిస్తామని, రాబోయే కాలంలో వచ్చే కొత్త గనుల కోసం అవసరమైన మే రకు మాత్రమే ఉద్యోగాల్లో డిపెండెం ట్లను భర్తీ చేసే విధానంపై యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య ఒప్పందం జరిగింది. సీఎండీకి ఆదేశాలు.. గతంలో రెండేళ్ల సర్వీస్‌ను యాజమాన్యానికి వదిలిపెట్టిన కార్మికులు తమ వారసులను సింగరేణిలో ఉద్యోగంలో పెట్టించే వారు. అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన ఒప్పందం తర్వాత కేవలం పూర్తిస్థారుు అనారోగ్యానికి గురైన, గని ప్రమాదంలో మరణించిన వారి స్థానంలో మాత్రమే వారసులకే ఉద్యోగాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా వారసత్వ ఉద్యోగాల ను పునరుద్ధరించాలని కార్మికులు చేస్తు న్న డిమాండ్‌కు పరిష్కారం లభించలేదు. తాజాగా గురువారం జరిగిన చర్చల్లో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని సీఎం కేసీఆర్.. సీఎండీని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 2015-16లో సంస్థ సాధించిన సుమారు రూ.1066 కోట్ల లాభాల నుంచి 23 శాతం వాటా అంటే సుమారు రూ.245 కోట్లకు పైగా కార్మికులకు పం పిణీ చేయాలని, ఈ మొత్తాన్ని కూడా శు క్రవారం నాడే చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే మాత్రం 10వ తేదీలోగా డబ్బులు బ్యాంకులో జమ చేసేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. 2014-15లో సంస్థ రూ.490 కోట్లు లాభాలు సాధించగా...అందులో నుంచి 21 శాతం వాటా కింద రూ.103 కోట్లను కార్మికులకు పం పిణీ చేశారు. ఈసారి మాత్రం గతం క న్నా రెండు శాతం పెంచి కార్మికులకు దస రా కానుకగా వాటా డబ్బులు చెల్లించనున్నారు. దీని ప్రకారం ఒక్కో కార్మికుడు కనీసంగా రూ.40 వేలు, గరిష్టంగా రూ. లక్ష వాటా కింద పొందనున్నారు. ఇదిలా ఉండగా సింగరేణి గని కార్మికులకు అనుకూలంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై కోల్‌బెల్ట్‌లో సంబురాలు మిన్నంటారుు. కార్మికులు, వారి కుటుం బసభ్యులు టపాసులు కాల్చి ఆనందోత్స వాలు జరుపుకున్నారు. ట్యాంకు ఎక్కి వీఆర్ఎస్ డిపెండెంట్ల నిరసన గోదావరిఖని : సింగరేణిలో 1997 నుంచి 2001 వరకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) కింద ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల వారసులకు ఉద్యోగాలివ్వకుండా ప్రభుత్వం తమ జీవితాలతో దోబూచులాడుతోందని వీఆర్ఎస్ డిపెండెంట్లు గురువారం రాత్రి గోదావరిఖనిలో అశోక్‌నగర్‌లోని మున్సిపల్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. 1997 నుంచి 2001 మధ్య కాలంలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిస్తామని ఆశచూపి ట్రెయినింగ్ ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగాలు లేవంటూ రూ.2 లక్షలు బలవంతంగా బ్యాంకులో జమచేశారని పేర్కొన్నారు. కాగా, గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2 లక్షలు తీసుకోని వీఆర్ఎస్ డిపెండెంట్లకు మాత్రమే ఉద్యోగావకాశం కల్పిస్తామన డంతో ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని ట్యాంకు దిగాలని కోరినా ఆందోళన కొనసాగిస్తున్నారు. -
కార్మికులకు పండగే
సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు వారసత్వ ఉద్యోగాలపై చరిత్రాత్మక నిర్ణయం వెల్లువెత్తిన హర్షాతిరేకాలు సర్వీసుతో సంబంధం లేకుండా ఉద్యోగాలు లాభాల్లో వాటా శాతం 21 నుంచి 23కు పెంపు వీఆర్ఎస్ వారికి కూడా అవకాశం ఫలించిన కార్మిక కలలు 18 ఏళ్ల నిరీక్షణ.. ఆందోళనలు.. ధర్నాలు.. నిరసన లు.. చివరికి నేతలపై దాడుల వరకు వెళ్లిన వారసత్వ ఉద్యోగాల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. కార్మికులు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాలకు బుధవారం లైన్‌క్లియర్ అరుు్యంది. సింగరేణి చరిత్రలోనే కనీవినీ ఎరుగని నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సర్వీసుతో నిమిత్తం లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి యాజ మాన్యాన్ని ఆదేశించారు. ఈ నిబంధన తీసేసి వారసత్వం ఇవ్వడం సింగరేణిలో చరిత్ర సృష్టిస్తోంది. దీంతోపాటు కంపెనీ 2015-16 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధిం చిన రూ.1,066 కోట్ల లాభాల్లో నుంచి కార్మికులకు 23 శాతం వాటా ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ కోసం ఉద్యమించి.. గనులు బంద్ చేసి సకల జనుల సమ్మెతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దిక్సూచిగా మారి న సింగరేణి కార్మిక బిడ్డల చిరకాల కోరిక నెరవేరిం ది. తెలంగాణ వస్తే సింగరేణిలో తమకు ఏది కావాలని కోరుకున్నారో కార్మికులకు నేడు అది దక్కింది. దీంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. శ్రీరాంపూర్ : వారసత్వ ఉద్యోగాలు, లాభాల్లో వాటా ఇంకా ఇతర ప్రధాన డిమాండ్లపై మూడు రోజులుగా గుర్తింపు సంఘం నేతలు, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్‌లో మకాం వేశారు. ఎప్పుడెప్పుడు సీఎం పేషీ నుంచి కబురు వస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూసిన నేతలకు బుధవారం సాయంత్రం పిలుపు రానే వచ్చింది. దీంతో సీఎం కార్యాలయంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఎంపీ బాల్క సుమన్, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు, టీబీజీకేఎస్ నుంచి అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు ఆకునూరి కనుకరాజు, మిర్యాల రాజిరెడ్డిలు హాజరయ్యూరు. ఈ చర్చల్లో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. సింగరేణిలో 1981 నుంచి వారసత్వ ఉద్యోగాలు మొదలయ్యాయి. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో జాతీయ సంఘాలు యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం వల్ల 1998 జూన్ 6 నుంచి వారసత్వ ఉద్యోగాలు నిలిచిపోయాయి. దీంతో కార్మికులు 18 ఏళ్ల నుంచి వారసత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. అన్ని సంఘాల కంటే మొదటగా టీబీజీకేఎస్ వారసత్వ ఉద్యోగాలపై ప్రధానంగా దృష్టి సారించి పోరాటం మొదలు పెట్టింది. ఉద్యమ వేడిలో ఈ డిమాండ్ ఊపందుకుంది. దీంతో గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇదే ప్రధాన డిమాండ్‌తో టీబీజీకేఎస్ ఎన్నికలకు వెళ్లింది. కార్మికులు ఈ డిమాండ్‌ను నెరవేర్చుతారనే ఉద్ధేశంతో జాతీయ సంఘాలను కాదని మొదటి సారి ప్రాంతీయ సంఘమైన టీబీజీకేఎస్‌ను గుర్తింపు సంఘంగా గెలిపించారు. అప్పటి నుంచి వారసత్వ ఉద్యోగాలపై యాజమాన్యం, ప్రభుత్వంపై టీబీజీకేఎస్ ఒత్తిడి తెస్తున్నా.. అది సాధ్యం కాలేదు. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖలు, సంస్థలపై సమీక్ష సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించారు. కాని సింగరేణిపై ఆలస్యం చేయడంతో కార్మికుల్లో ఒకింత అసహనం రేకేత్తించింది. జాప్యమైనా సరే మెజారీటీ కార్మికవర్గానికి ప్రయోజనకారిగా మారే నిర్ణయాలు చివరికి తీసుకోవడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సర్వీసు నిబంధనకు చెల్లుచీటి.. గతంలో వారసత్వ ఉద్యోగాలు ఉన్నప్పుడు రెండేళ్ల సర్వీసు నిబంధన ఉండేది. కార్మికుడు తన కొడుకు ఉద్యోగం పెట్టించుకోవాలంటే రెండేళ్ల ముందు దిగిపోయేవాడు. ఇప్పుడు ఒక వేళ వారసత్వ ఉద్యోగాలు వచ్చినా అదే పద్ధతి కొనసాగుతుందని అందరూ భావించారు. చివరికి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు కూడా ఇదే భావనతో ఉన్నారు. ఈ నిబంధన పెడితే కేవలం రెండేళ్ల సర్వీసు లోపు ఉన్న వారి నుంచి తీవ్ర వ్యతిరేక వస్తుందని భావించి కనీసం మెడికల్‌బోర్డుకు దరఖాస్తు చేసుకుకే నాటికి రెండేళ్లు ఉన్న వారిని పరిగణనలోకి తీసుకున్నా మేలు జరుగుతుందని భావించారు. కాని సమావేశంలో కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటిస్తుంటే టీబీజీకేఎస్ నేతలు, ఎమ్మెల్యే, ఎంపీలే కంగుతిన్నారు. ‘సర్వీసుతో సంబంధం ఏంటయ్యా.. ఉద్యోగంలో ఉంటే చాలు దరఖాస్తు ఇచ్చిండంటే వారసత్వం కల్పించడయ్యా..’ అంటూ సీఎం నోటి నుంచి నిర్ణయం రావడంతో నేతలంతా కరతాళ ధ్వనులు చేయడం వారి వంతైంది. దీంతో రేండళ్ల సర్వీసు లోపల ఉన్న సుమారు 3,200 మంది కార్మికులు కూడా నేడు వారసత్వ పరిధిలోకి వచ్చారు. వీరికి అరుదుగా దక్కిన అవకాశంగా భావిస్తున్నారు. ముందు సర్వీసు దగ్గరపడ్డ వారికే ప్రాధాన్యం ముందు సర్వీసు దగ్గరపడ్డ వారిని సీరియల్ లిస్టులో ముందుగా పెట్టి వారసత్వం కల్పిస్తారు. ఒక వేళ కార్మికుని సర్వీసు 4 ఏళ్లు ఉండి అతడి కుమారుడి వయస్సు 35 ఏళ్ల వయస్సుకు దగ్గరపడిందంటేఉద్యోగ కనీస వయస్సు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని ముందుగా వారిని కూడా పరిగణనలోకి తీసుకోబోతున్నారు. ఈ వారసత్వ ఉద్యోగాలకు టైంబాండ్ అంటూ ఏదీ లేదని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య తెలిపారు. ఇది నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. వీఆర్ఎస్లో డిపెండెంట్లకు వరం.. 1997-2001 మధ్య వీఆర్ఎస్ డిపెండెంట్లకు కూడా వరాలు ఇచ్చారు. అప్పుడు ఈ మధ్యకాలంలో వారసత్వ ఉద్యోగాలు ఆగిపోవడంతో అప్పటికే దరఖాస్తు వారిలో సగం మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగిలిన సగం మందికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. దీనికి కొంత మంది ఒప్పుకొని డబ్బులు తీసుకోగా.. చాలా మంది తమకు డబ్బులు వద్దని ఉద్యోగాలే కావాలని తీసుకోలేదు. అప్పటి నుంచి వారు ఉద్యోగాల కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి ఇందులో నిర్ణయం తీసుకున్నారు. ఇక డబ్బులు తీసుకున్న వారు, డిస్మిస్ కార్మికుల సమస్యను యూనియన్ నేతలు యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకోవాల్సిందిగా సీఎం సూచించారు. పెరుగుతున్న లాభాల వాటా.. ఈ సారి కార్మికులకు లాభాల వాటా డబ్బులు పెద్దమొత్తంలో వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం వచ్చిన లాభాలు రూ.461 కోట్ల నుంచి కార్మికులకు 21 శాతం వాటాగా రూ.106 కోట్లు పంచారు. ఇప్పుడు కంపెనీకి వచ్చిన మొత్తం లాభం రూ.1066.13 కోట్ల నుంచి 23 శాతంగా మొత్తం రూ. 245.21 కోట్లు పంపిణీ కాబోతున్నాయి. ఈ లెక్కన కార్మికులకు కనీసం రూ.43 వేల పైగా అందనున్నాయి. దీనికి తోడు ఇటివల కోలిండియాలో జరిగిన ఒప్పందం ప్రకారం కార్మికులకు పీఎల్ఆర్ బోనస్ క్రింద రూ.54,000 వేలు చెల్లించనున్నారు. మొత్తం కలిపి రూ.లక్షకు పైగా కార్మికులు అందుకోబోతున్నారు. వీటికి సంబంధించిన తేదీలు ప్రకటించాల్సి ఉంది. దీంతో దసరా, దీపావళి పండుగల సంతోషం కార్మికుల ఇళ్లలో ముందే చేరింది. మా పోరాటం ఫలించింది సింగరేణి సన్స్ అసోసియేషన్(ఎస్ఎస్ఏ) తరఫున వారసత్వ ఉద్యోగాల కోసం ఇన్నాళ్లు చేసిన మా పోరాటం ఫలిచింది. వారసత్వ ఉద్యోగాల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. పండుగ పూట తీపి కబురు ఆనందంగా ఉంది. సీఎంకు, కృషి చేసిన టీబీజీకేఎస్‌కు ధన్యవాదాలు. - ఎన్.మహేశ్, ఎస్ఎస్ఏ ఉద్యోగం వస్తుందని ఆనందంగా ఉంది.. వారసత్వ ఉద్యోగాల కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశాం. ఇక రాదని అనుకున్న సమయంలో ముఖ్యమంత్రి ఉద్యోగాలు ప్రకటిం చడం ఆనందంగా ఉంది. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు దక్కుతాయ ని అనుకున్న భావన నేడు నిజమైంది. వారసత్వం ప్రకటించినందుకు సీఎంకు మా కృతజ్ఞతలు. - ఎం.రమేశ్, కార్మికుడి కుమారుడు వారసత్వం మా హక్కు.. వారసత్వ ఉద్యోగాలు మా హక్కు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోగోట్టిన వారసత్వ ఉద్యోగాలను నేడు తెలంగాణలో తెచ్చుకున్నాం. ఈ ఘనత కేసీఆర్‌దే. లాభాల వాటా కూడా పెంచడం మరింత సంతోషాన్ని నింపింది. దీనిపై వెంటనే యాజమాన్యంతో గుర్తింపు సంఘం రాత పూర్వక ఒప్పందం చేసుకుని త్వరలోనే అమలు చేయాలి. సింగరేణి కేసీఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. - సాన రాజయ్య, కార్మికుడు ఇన్నాళ్లకు మా బిడ్డలకు ఉద్యోగాలు.. వారసత్వ ఉద్యోగాలు వస్తే మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఇన్నాళ్లు ఎదురుచూశాం ఇది నెరవేరింది. వయస్సు మీద పడడంతో ఎముకలు అరిగినా పని చేస్తూ వచ్చాం. వారసత్వం ఇస్తే దిగిపోతామని ఇన్నాళ్లుగా ఎదుచూసినందుకు ఫలితం దక్కింది. సర్వీసు నిబంధన లేకపోవడం వల్ల చాలామందికి ప్రయోజనం చేకూరింది. - సోదరి మారుతి, కార్మికుడు -
వారసత్వ ఉద్యోగాల కోసం నిరసన
నల్లబ్యాడ్జీలు ధరించిన సింగరేణి సన్స్ శ్రీరాంపూర్ : వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం అసోసియేషన్ నాయకులు ఎస్సార్పీ 1 గనిపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ డివిజన్ ఇన్చార్జి ఎన్. మహేశ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే వారసత్వ ఉద్యోగాలు ప్రకటించాలన్నారు. అన్ని కార్మిక సంఘాలు వారసత్వ ఉద్యోగాల కోసం పోరాడాలని కోరారు. దీని కోసం సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే జాప్యం వల్ల సర్వీసు కోల్పోయి చాలా మంది ఉద్యోగాలు కల్పించిన ఉద్యోగాలు రాకుండాపోతున్నాయని తెలిపారు. ఎలాంటి సర్వీసు నిబంధనలు లేకుండా దరఖాస్తు చేసుకున్న వారందరికీ వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం కార్మికుల సంఘాలు తమ డిమాండ్‌ను వాడుకుంటున్నాయని తప్ప తమ ఉద్యోగాల పట్ల వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలు సాధించే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌కు చెందిన నరేశ్, రాజేందర్, దిలీప్, సందీప్, సాగర్, విజయ్, అనిల్ పాల్గొన్నారు.