సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరణ | CM KCR ANNOUNCES on SINGARENI DEPENDENT JOBS | Sakshi
Sakshi News home page

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరణ

Published Fri, Oct 7 2016 1:14 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరణ - Sakshi

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరణ

  లాభాల్లో 23 శాతం వాటా.. నేడు చెల్లింపు
  రూ.2 లక్షలు తీసుకుని డిపెండెంట్లకు ఉద్యోగావకాశాలు
  విధి విధానాలు ఖరారు చేయాలని సీఎండీకి 
  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
  కోల్‌బెల్ట్‌లో మిన్నంటిన సంబరాలు
 
గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణిలో కొన్నేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అలాగే 1997 నుంచి 2001 వరకు వలం టరీ రిటైర్డ్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) ద్వారా ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల వారసుల నుంచి రూ.2 లక్షలు తీసుకుని వారికి కూడా ఉద్యోగావకాశం క ల్పించనున్నట్లు ప్రకటించారు. 2015 -16లో సాధించిన రూ.1066 కోట్ల లాభాల నుంచి 23 శాతం వాటాను కార్మికులకు చెల్లించేందుకు సీఎం అంగీకరించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత, పెద్దపల్లి, మానుకోట ఎంపీలు బాల్క సుమన్, సీతారాంనాయక్, మాజీ ఎంపీ జి.వివేక్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్‌రా వు, కోరం కనకయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, నాయకులు కెంగర్ల మల్ల య్య, మిర్యాల రాజిరెడ్డి, ఆకునూరి కనకరాజు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 1998 జూన్ 6వ తేదీ నాటికి ఉన్న 1100 మంది డిపెండెంట్లకు ఆనాటి నుంచి మూడేళ్లలో ఉద్యోగాలిస్తామని, రాబోయే కాలంలో వచ్చే కొత్త గనుల కోసం అవసరమైన మే రకు మాత్రమే ఉద్యోగాల్లో డిపెండెం ట్లను భర్తీ చేసే విధానంపై యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య ఒప్పందం జరిగింది. 
 
 సీఎండీకి ఆదేశాలు..
 గతంలో రెండేళ్ల సర్వీస్‌ను యాజమాన్యానికి వదిలిపెట్టిన కార్మికులు తమ వారసులను సింగరేణిలో ఉద్యోగంలో పెట్టించే వారు. అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన ఒప్పందం తర్వాత కేవలం పూర్తిస్థారుు అనారోగ్యానికి గురైన, గని ప్రమాదంలో మరణించిన వారి స్థానంలో మాత్రమే వారసులకే ఉద్యోగాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా వారసత్వ ఉద్యోగాల ను పునరుద్ధరించాలని కార్మికులు చేస్తు న్న డిమాండ్‌కు పరిష్కారం లభించలేదు. తాజాగా గురువారం జరిగిన చర్చల్లో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని సీఎం కేసీఆర్..  సీఎండీని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 2015-16లో సంస్థ సాధించిన సుమారు రూ.1066 కోట్ల లాభాల నుంచి 23 శాతం వాటా అంటే సుమారు రూ.245 కోట్లకు పైగా కార్మికులకు పం పిణీ చేయాలని, ఈ మొత్తాన్ని కూడా శు క్రవారం నాడే చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే మాత్రం 10వ తేదీలోగా డబ్బులు బ్యాంకులో జమ చేసేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. 2014-15లో సంస్థ రూ.490 కోట్లు లాభాలు సాధించగా...అందులో నుంచి 21 శాతం వాటా కింద రూ.103 కోట్లను కార్మికులకు పం పిణీ చేశారు. ఈసారి మాత్రం గతం క న్నా రెండు శాతం పెంచి కార్మికులకు దస రా కానుకగా వాటా డబ్బులు చెల్లించనున్నారు. దీని ప్రకారం ఒక్కో కార్మికుడు కనీసంగా రూ.40 వేలు, గరిష్టంగా రూ. లక్ష వాటా కింద పొందనున్నారు. ఇదిలా ఉండగా సింగరేణి గని కార్మికులకు అనుకూలంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై కోల్‌బెల్ట్‌లో సంబురాలు మిన్నంటారుు.  కార్మికులు, వారి కుటుం బసభ్యులు టపాసులు కాల్చి ఆనందోత్స వాలు జరుపుకున్నారు.
 
 ట్యాంకు ఎక్కి వీఆర్‌ఎస్ డిపెండెంట్ల నిరసన
 గోదావరిఖని : సింగరేణిలో 1997 నుంచి 2001 వరకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) కింద ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల వారసులకు ఉద్యోగాలివ్వకుండా ప్రభుత్వం తమ జీవితాలతో దోబూచులాడుతోందని వీఆర్‌ఎస్ డిపెండెంట్లు గురువారం రాత్రి గోదావరిఖనిలో అశోక్‌నగర్‌లోని మున్సిపల్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. 1997 నుంచి 2001 మధ్య కాలంలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిస్తామని ఆశచూపి ట్రెయినింగ్ ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగాలు లేవంటూ రూ.2 లక్షలు బలవంతంగా బ్యాంకులో జమచేశారని పేర్కొన్నారు. కాగా, గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2 లక్షలు తీసుకోని వీఆర్‌ఎస్ డిపెండెంట్లకు మాత్రమే ఉద్యోగావకాశం కల్పిస్తామన డంతో ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని ట్యాంకు దిగాలని కోరినా ఆందోళన కొనసాగిస్తున్నారు. 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement