కార్మికశాఖ వరంగల్ జోన్ సంయుక్త కార్మిక కమిషనర్(జేసీఎల్) గా కె.భాగ్యానాయక్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నల్గొండ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా విధులు నిర్వహించిన ఆయన 2015 డిసెంబర్‌లో వరంగల్ జోన్ ఇన్‌చార్జి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా బదిలీపై వచ్చారు.
కార్మికశాఖ జేసీఎల్‌గా భాగ్యానాయక్
Published Fri, Sep 9 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
హన్మకొండ చౌరస్తా : కార్మికశాఖ వరంగల్ జోన్ సంయుక్త కార్మిక కమిషనర్(జేసీఎల్) గా కె.భాగ్యానాయక్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నల్గొండ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా విధులు నిర్వహించిన ఆయన 2015 డిసెంబర్‌లో వరంగల్ జోన్ ఇన్‌చార్జి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా బదిలీపై వచ్చారు.
జేసీఎల్‌గా పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల సమస్యల పరిష్కారం, పెండింగ్‌లో ఉన్న కార్మిక సంక్షేమ నిధుల విడుదలకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని భాగ్యానాయక్ ఈ సందర్భంగా తెలిపారు. బాధ్యతలు చేపట్టిన భాగ్యానాయక్‌ను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారులు శంకర్, రమేష్‌బాబు, జాసన్‌లు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
Advertisement