భీమడోలు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి హామీ పనులకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. దాసరి దుర్గారావు (49) బుధవారం ఉపాధి కూలీ పనులకు వెళ్లగా చేయి నొప్పిగా ఉందని పడిపోయాడు. తోటి కూలీలు అతడ్ని భీమడోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యుడు సూచించడంతో అక్కడి నుంచి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే దుర్గారావు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చని వైద్యులు చెప్పారు.