సాగును నమ్ముకున్నాడు. రెండేళ్లుగా రూ.1.20 లక్షలు అప్పు తెచ్చి మరీ పంటలు సాగు చేశాడు.
మల్లాపూర్: సాగును నమ్ముకున్నాడు. రెండేళ్లుగా రూ.1.20 లక్షలు అప్పు తెచ్చి మరీ పంటలు సాగు చేశాడు. కానీ, దిగుబడి రాక నష్టపోయాడు. చివరికి కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీగా మారాడు. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన మేకల చిన్న భీమయ్యది ఈ దుస్థితి.
అయితే, చేసిన అప్పులు తీర్చడం ఎలా అన్న మనోవేదనతో భీమయ్య ఆందోళన చెందాడు. శనివారం కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతతో ప్రాణాలు విడిచాడు.