క్వారీలో పనిచేస్తున్న ఒక కూలీ ప్రమాదవశాత్తూ కిందపడి మృతిచెందాడు.
కృష్ణా: క్వారీలో పనిచేస్తున్న ఒక కూలీ ప్రమాదవశాత్తూ కిందపడి మృతిచెందాడు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం జొన్నబండ క్వారీలో పనిచేస్తున్న సురేంద్ర (35) అనే కూలీ తాడు సాయంతో కొండపై నుంచి దిగుతూ ప్రమాదవశాత్తూ జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఖమ్మం జిల్లా పాల్వంచ గ్రామానికి చెందినవాడు. అతను ఏడేళ్లుగా క్వారీ కూలీగా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.