
బోల్తా పడ్డ లారీ
కశింకోట (అనకాపల్లి): పరవాడపాలెం కూడలి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైవే పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. పరవాడపాలెం గ్రామానికి చెందిన పరవాడ చెల్లయ్య (60) కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు.
కూలీ పనికి అనకాపల్లి వెళ్లి ఇంటికి వస్తూ తమ గ్రామం కూడలి వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా.. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వేగంగా వెళుతున్న రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. దీంతో చెల్లయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మోటారు సైకిళ్లు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడగా, వారిని హైవే పోలీసులు అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
లారీ బోల్తా..
తాళ్లపాలెం మామిడివాక గెడ్డ వంతెన వద్ద సోమవారం లారీ బోల్తా పడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న కోళ్ల దాణా లోడు లారీ అదుపు తప్పి ఒకవైపు బోల్తా పడింది.
Comments
Please login to add a commentAdd a comment