సాక్షి, కొల్లాపూర్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం పనుల్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. సొరంగంలో బ్లాస్టింగ్ చేసేందుకు నిర్దేశించిన స్దలంలో జిలెటిన్ స్టిక్స్ అమర్చారు. అయితే కూలీలు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో వారంతా గాయపడ్డారు. వారిని నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు.
క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఆయితే ప్రమాద స్థలంలో ఉరుములు మెరుపులు రావటంతో దాని ప్రభావం వల్ల బ్లాస్టింగ్ జరిగినట్టు భావిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు బిహార్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కూలీలుగా చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment