
ఇండోర్ : అర్హతలు లేకున్నా ఒక మతానికి చెందిన ఐదుగురు సాధువులకు క్యాబినేట్ హోదా కల్పించడంపై మధ్యప్రదేశ్‌లో వివాదం రాజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వారికి మంత్రి హోదా కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, తక్షణమే ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెనక్కి తీసుకునేలా చూడాలని పిటిషనర్ రాం బహాదూర్ శర్మ కోర్టును కోరారు.
తప్పేమీలేదు: దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నా.. ఆ నిర్ణయంలో ఏ విధమైన తప్పులేదని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమర్థించుకున్నారు. ‘మా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకూ సమానమైన అవకాశాలు కల్పిస్తుంది. కులం, మతం, ప్రాంతీయ భేదాలు ఉండబోవు’’అని సీఎం చెప్పుకొచ్చారు. కాగా, కాషాయ దుస్తులు ధరించినవారికి మంత్రి హోదాలిచ్చి, వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment