
రోడ్‌షోలో శివరాజ్‌సింగ్ చౌహాన్
మైసూరు : వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తానే ప్రధాన మంత్రినంటూ వ్యాఖ్యలు చేసి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన అవివేకాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు.గురువారం ఆయన బీజేపీ అభ్యర్థి ఎస్.ఆర్.రామదాస్ తరఫున ప్రచారం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.ఏఒక్క పార్టీతోనూ సఖ్యత లేకున్నా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు దక్కనున్నాయని, తాను ప్రధానమంత్రినవుతానని అవివేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు.
ఓట్లు,అధికారం కోసం వీరశైవుల, లింగాయత్‌ల మధ్య మతచిచ్చు పెట్టిన పాపం కాంగ్రెస్ పార్టీదేనంటూ ఆరోపించారు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఎస్‌డీపీఐ, కేఎఫ్‌డీ తదితర ఉగ్రవాద అనుబంధ సంస్థలకు కాంగ్రెస్ వెన్నుదన్నుగా నిలిచిందంటూ ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో కర్ణాటక, పుదుచ్చేరి, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారం కోల్పోవడం తథ్యమన్నారు. ఎన్నికల్లో బీజేపీకి అధికారం అప్పగించడానికి రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment