
ఉపాధి కల్పన ఏ ప్రభుత్వానికైనా పెద్ద సవాల్. పెట్టుబడులు రాబట్టేందుకు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు ప్రత్యేక ఏజెన్సీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంటాయి. కానీ సోషల్ మీడియా విస్తృతం అయ్యాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. మంచి సందర్భం చిక్కితే చాలు రంగంలోకి దిగిపోతున్నారు ప్రభుత్వాధినేతలు.
ఇటీవల ఆనంద్ మహీంద్రా తనకు సినిమా రంగంపై ఉన్న మక్కువను చెబుతూ వస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. తాజాగా కెమెరాతో షూటింగ్‌లో బిజీగా ఉన్న ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఈ ఫోటోకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. ‘ విధి రాతను ఎవరూ మార్చలేరు. మీరు కెమెరా వెనకాల ఉండాలని అనుకున్నారు.. కానీ మేము మీరు మహీంద్రా రైజ్ వెనుక ఉండాలని మేం భావించాం. చివరకు అదే జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు మహీంద్రాను ఆహ్వానిస్తున్నాం అంటూ శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. దీనికి ఆనంద్ మహీంద్రా బదులిస్తూ మీ ఆహ్వానాన్ని తప్పకుండా పరిశీలిస్తానంటూ చెప్పారు.
😊 🙏🏽🙏🏽🙏🏽 I may take you up on that offer @ChouhanShivraj ji! https://t.co/Tu0iGjDh8D
— anand mahindra (@anandmahindra) January 23, 2022
గత వారం టెస్లా కార్ల ఫ్యాక్టరీని తెలంగాణలో నెలకొల్పాలంటూ ఎలన్ మస్క్‌ను ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ కోరడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేటీఆర్ ట్వీట్ వచ్చిన 24 గంటల్లోనే మొత్తం ఏడు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు ఎలన్‌మస్క్‌కు ఇదే విషయంలో రిక్వెస్ట్ చేశారు. ఈ పరంపరలో తాజాగా శివరాజ్‌సింగ్ చౌహాన్ పారిశ్రామికంగా వెనుకబడిన మధ్యప్రదేశ్‌ఖి పెట్టుబడులు ఆకర్షించే పనిలో పడ్డారు.