భోపాల్: పోలీసులు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఖాకీ డ్రస్సు.. ముఖంలో కాఠిన్యం.. మాటల్లో మొరటుదనం. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. కానీ వారిలో కూడా మంచితనం, మానవత్వం ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు బోలేడు జరిగాయి. తాజాగా అలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయపడ్డ ఓ మహిళను భుజాల మీద మోసుకుని వెళ్లాడు ఓ పోలీసు అధికారి. వివరాలు.. రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్, జబల్‌పూర్‌లో 35 మందితో వెళ్తున్న ఓ మినిట్రక్కుకు యాక్సిడెంట్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను తమ వాహనంలో ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సరిపడా స్ట్రెచర్‌లు లేకపోవడంతో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్స్ సంతోష్ సేన్, ఎల్ ఆర్ పటేల్, కానిస్టేబుల్స్ అశోక్, రాజేష్, అంకిత్‌లు స్థానికుల సాయంతో క్షతగాత్రులను తమ భుజాల మీద మోసుకెళ్లారు. (చదవండి: తను అలా పిలవగానే షాకయ్యాం: డీఎస్పీలు)
వీరిలో 57 ఏళ్ల సంతోష్ సేన్ గాయపడిన ఓ పెద్దావిడను తన వీపు మీద మోసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మరో అధికారి సాయంతో ఆమెను లోపలికి తీసుకెళ్లారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే 14 ఏళ్ల క్రితం పరారీలో ఉన్న ఓ క్రిమినల్‌ని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తుండగా.. జరిగిన కాల్పుల్లో సేన్ కుడి భుజానికి బుల్లెట్ తగిలింది. అప్పటి నుంచి ఆయన కుడి చేయి సరిగా పని చేయడం లేదు. అయినప్పటికి దాన్ని లెక్కచేయకుండా సదరు సీనియర్ అధికారి, మహిళకు సాయం చేశాడు. సేన్, మహిళను తన వీపు మీద మోసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సేన్‌ని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment