
లక్నో : సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో రెండు రోజుల క్రొతమే ఆసుపత్రి పాలైన ములాయం..సోమవారం తెల్లవారుజామున మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత ఐదు రోజుల్లోనే రెండు సార్లు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ములాయం సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
అంతకుముందు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ , ములాయం సోదరుడు శివపాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘ములాయం ఆరోగ్యం గురించి చాలామంది శ్రేయాభిలాషులు ఆందోళన చెందుతున్నారు..ప్రస్తుతం దేవుని దయ వల్ల ములాయంసింగ్ ఆరోగ్యం బాగానే ఉంది. దీర్ఘకాలం ఆయన జీవించాలని దేవుడిని ప్రార్థించండి" అంటూ కోరారు.
श्री मुलायम सिंह यादव जी के अस्वस्थ होने का समाचार मिला।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 10, 2020
मैं ईश्वर से प्रार्थना करता हूँ कि वे उन्हें शीघ्र ही पूर्ण स्वस्थ करें।