
(ఫైల్ ఫోటో)
ముంబయి : సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం మరోసారి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ములాయంను ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ములాయంను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా తర్వాతే ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేసేది సాయంత్రంలోగా వెల్లడిస్తామని వైద్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.