సాక్షి, మధ్యప్రదేశ్ : ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్ఖజ్‌కు వెళ్లివచ్చినవారిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు జమాత్‌కు వెళ్లివచ్చినవారిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నాయి. అయితే వారిలో కొందరు ప్రభుత్వాలకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అలాంటి వారికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మర్కజ్‌లో పాల్గొన్న వ్యక్తులు వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. బయటకు రాకుండా దాక్కున్న తబ్లీఘీలు.. 24 గంటల్లో రిపోర్టు చేయపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని , వారంతా క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మహారాష్ర్టలో తబ్లీగి జమాత్‌కు హాజరైన వారిలో 50 నుంచి 60 మంది తమ మొబైల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేశారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా మర్కజ్ కేసులు బయటపడటంతో వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పారు. వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో 229 కరోనా పాజిటివ్ కేసులు నదవగా, 13 మంది మృతిచెందారు. అయితే వీరిలో ఇప్పటి వరకు ఎవరూ డిశ్చార్జి కాలేదని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment