
కుటుంబ సభ్యులతో చిరంజీవి
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటంలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ పిలుపునకు మేముసైతం అంటూ సినీ సెలబ్రిటీలు తమ మద్దతు తెలిపారు. ఉదయం నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు.. సాయంత్రం 5గంటలకు ఇంటి ఆవరణ ల్లోకి విచ్చేసి అత్యవసర సేవలు అందిస్తున్న పలు విభాగాల సిబ్బందికి చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, వెంకటేష్, అల్లు అరవింద్, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు విష్ణు, మనోజ్, గోపీచంద్, రాజశేఖర్, వరుణ్ తేజ్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, నాగబాబు, తమన్నా, చార్మీ, పూజా హెగ్డే, జీవిత, మంచు లక్ష్మి వంటి వారు చప్పట్లు కొడుతున్న, గంటలు మోగిస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కుటుంబ సభ్యులతో అల్లు అరవింద్, అల్లు అర్జున్
చార్మి, పూరి జగన్నాథ్