సాక్షి, హైదరాబాద్: హమ్మయ్య.. పరిస్థితులు చక్కబడ్డాయి.. అని సంతోష పడుతున్న వేళ మళ్లీ మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ మొదలుపెట్టింది. కరోనా దేశంలోకి ప్రవేశించడంతో 2020 మార్చి 22వ తేదీన భారత ప్రభుత్వం ‘జనతా కర్ఫ్యూ’ విధించింది. ఆ రోజు దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎక్కడ చూసినా నిర్మానుష్యం. అసలు భారతదేశంలో జనాభా ఉందా అనేంత రీతిలో ‘జనతా కర్ఫ్యూ ’ విజయవంతమైంది. ఆ రెండు రోజులకే మార్చి 25వ తేదీన లాక్‌డౌన్ పరంపర మొదలైన తెలిసిందే.
అయితే జనతా కర్ఫ్యూకు విధించి ఏడాదయ్యింది. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. కరోనా వైరస్ ఇంకా దేశంలో కల్లోలం రేపుతూనే ఉంది. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంపై మహమ్మారి చావుదెబ్బ కొట్టింది. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వ్యాక్సిన్ రావడంతో దాని పీడ విరగడ అయ్యిందని భావించి భారతదేశం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ మహమ్మారి దాడి మొదలుపెట్టింది. అప్పటి మాదిరి రోజుకు 50 వేలకు చేరువలో దేశంలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం.
అప్పటి ఆందోళనకర పరిస్థితులు ఇంకా తొలగిపోలేదు. కరోనా రెండోసారి తీవ్ర స్థాయిలో దాడి చేస్తోంది. అయితే వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా సాగుతున్నా కూడా వైరస్ అదుపులోకి రావడం లేదు. అదుపులోకి వచ్చినట్టు వచ్చి గాయపడిన పులి మాదిరి పంజా విసురుతోంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా పాజిటివ్ రావడం ఆందోళన కలిగించే అంశం. కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే పలు రాష్రా‍్టల్లో పాక్షిక లాక్‌డౌన్, కొన్ని ఆంక్షలు విధిస్తున్నాయి. తెలుగు రాష్రా‍్టల్లోనూ త్వరలో ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఏడాది ముగిసినా కూడా మహమ్మారి పీడ అంతం కాకపోవడం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. మళ్లీ లాక్‌డౌన్ అనేది విధిస్తే ఇక భారతదేశం కోలుకోలేని స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది.
చదవండి: ప్రధాని మోదీతో భేటీకి సిద్ధం.. ఈలోపే కరోనా!
Comments
Please login to add a commentAdd a comment