
ప్రతీకాత్మక చిత్రం
పెర్కిట్ (ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథనిలో గ్రామస్తులు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటి నుంచి బయటకు వస్తే రూ.1,000 జరిమానా విధించనున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ ప్రకటించింది. కరోనా వైరస్ నివారణకు అరికట్టడానికి ఆదివారం చేపట్టబోయే జనత కర్ఫ్యూకు గ్రామస్తులకు సహకరించాలని కమిటీ సూచించింది.