ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అనేక మంది సెలబ్రెటీలు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. హ్యాండ్ వాష్ చాలెంజ్, సెల్ఫ్ ఐసోలేషన్ (స్వీయ గృహ నిర్భంధం) వంటి కార్యక్రమాలను తాము పాటిస్తూ ప్రజలు పాటించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం నిర్వహించబోయే ‘జనతా కర్ఫ్యూ’ కు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ జనతా కర్ఫ్యూలో తాము భాగం అవుతున్నామని ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు పలువురు నటీనటులు జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం జనతా కర్ఫ్యూపై ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కరోనాని జయించాలంటే అందరం మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ చరణ్ తో కలిసి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని మరియు సురక్షితంగా ఉండాలని అలాగే సామాజిక దూరం పాటించాలని ఆ వీడియోలో ఎన్టీఆర్ కోరిన సంగతి తెలిసిందే.
#covid19 ని జయించాలంటే అందరం మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
— Jr NTR (@tarak9999) March 21, 2020
The world is going through one of its hardest times. The only way to get past #COVID19 is not panicking and spreading awareness.
— RRR Movie (@RRRMovie) March 16, 2020
Stay Hygienic. Stay Safe! pic.twitter.com/UMHnLmdkA8
చదవండి:
జనతా కర్ఫ్యూకు మెగాస్టార్ మద్దతు
నమస్కారం చేద్దాం: చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment