నగరిలో బ్యాడ్మింటన్ ఆడుతున్న ఎమ్మెల్యే ఆర్కేరోజా
సాక్షి, నగరి: యువకుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికే గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్కేరోజా తెలిపారు. రోజా ఛారిటబుల్ ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడా సంబరా ల్లో భాగంగా సోమవారం బాల్ బ్యాడ్మింటన్ పోటీ లు జరిగాయి. నగరి, పుత్తూరు మండలాలకు సంబంధించిన పోటీల్లో ఎమ్మెల్యే రోజా తన భర్త సెల్వమణి, సోదరుడు కుమారస్వామిరెడ్డితో బ్యాట్మింటన్ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిభ ఉన్నా అవకాశం లేక అనేక మంది క్రీడాకారులు మరుగున పడుతున్నారని తెలిపారు. అందువల్లే మండల, నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
నగరి మండలంలో..
అండర్ 17 విభాగంలో 17 జట్లు, 17 ఏళ్లు పైబడిన విభాగంలో 48 జట్లు పోటీపడుతున్నాయి. నగరి డిగ్రీ కళాశాల మైదానంలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘ డైరెక్టర్ చంద్రారెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు బీఆర్వీ అయ్యప్పన్, నాయకులు దయానిధి, మురుగ, మునికృష్ణారెడ్డి, అయ్యప్ప, కన్నాయిరం తదితరులు పాల్గొన్నారు.
పుత్తూరు మండలంలో..
అండర్ 17 విభాగంలో 6 జట్లు, 17 ఏళ్లు పైబడిన విభాగంలో 36 జట్లు పోటీపడుతున్నాయి. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల ప్రారంభోత్సవంలో ఎంపీపీ మునివేలు, మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి, వైస్ చైర్మన్ జయప్రకాష్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ వీఎం మాహిన్, కౌన్సిలర్లు ఏకాంబరం, వనిత, ఎంఎల్‌ఓ దిలీప్ మొదలి, నాయకులు కేటీ ప్రసాద్, రవీంద్ర, చక్రి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment