breaking news
playing kabaddi
-
సరదాగా కాసేపు .. కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా
నిండ్ర: తన చిన్ననాటి ఆటలను గుర్తుతెచ్చు కున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని ఉప్పొంగిపోయారు. కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు.. ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆదివారం నిండ్రలో అంబేడ్కర్ కబడ్డీ టోర్నమెంట్ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్యామ్లాల్, మండల కన్వీనర్ వేణురాజు, సర్పంచ్ వసంత బాబురెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేరీ దామోదరం, సింగిల్ విండో అధ్యక్షుడు నాగభూషణంరాజు, స్థానిక నేతలు అనిల్, పరంధామ, దీప పాల్గొన్నారు. చదవండి: వైఎస్ విజయమ్మ సైకత శిల్పం అన్నింట్లో 'ఆమె'కు అగ్రతాంబూలం -
కబడ్డీ ఆడుతూ విద్యార్థి మృతి
రంగారెడ్డి (శంషాబాద్): శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం జరిగిన కబడ్డీ పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. కబడ్డీ ఆడుతూ సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న సంపత్ అనే విద్యార్థి కళ్లు తిరిగి కిందపడిపోయాడు. దీంతో కళాశాల యాజమాన్యం చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కళాశాల యాజమాన్యం మండుటెండలో కబడ్డీ ఆడించినందు వల్లే మృతి చేందాడని ఆసుపత్రి వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.