
సాక్షి, చిత్తూరు: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పుట్టినరోజు సందర్భంగా నగరి దేశమ్మ తల్లి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. నగరి బస్టాండ్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహం దగ్గర పుట్టినరోజు కేక్ కట్ చేసి వికలాంగులకు ట్రై సైకిల్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. నగరి పీసీఎన్ పాఠశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, రక్త దాన శిబిరాలను సందర్శించారు. 40 ఏళ్లు పైబడిన మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు పింక్ బస్‌ను ప్రారంభించారు. అనంతరం తన నివాసం వద్ద ‘న్యూ నగరి-నో ప్లాస్టిక్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కిలో వ్యర్థ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం పంపిణీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment