ముద్దుకష్ణమ పార్టీ మారితే తప్పు కాదా ? | Gali Muddu Krishna Naidu PartyChange Wrong Not :Roja | Sakshi
Sakshi News home page

ముద్దుకష్ణమ పార్టీ మారితే తప్పు కాదా ?

Published Sun, Jul 6 2014 3:06 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

ముద్దుకష్ణమ పార్టీ మారితే తప్పు  కాదా ? - Sakshi

ముద్దుకష్ణమ పార్టీ మారితే తప్పు కాదా ?

నగరి : టీడీపీ కౌన్సిలర్ హరి హరన్ పార్టీ మార్చి ఓటేశార ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని, ఆ పార్టీ నాయకుడు ముద్దుకృష్ణమ నాయు డు పార్టీ మారింది తప్పు కాదా ? అని ఎమ్మెల్యే  ఆర్కేరోజా ప్రశ్నించారు. శనివారం ఆమె ఫోన్‌లో విలేకరితో మాట్లాడుతూ పార్టీ మార్చి ఓటు వేశారంటూ హరిహరన్ ఇంటి ముందు టీడీపీ నాయకులు ధర్నా చేయడాన్ని  ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పలుప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను రాబట్టుకొని మున్సిపల్ కుర్చీలను చేజిక్కించుకుందన్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని ముద్దుకృష్ణమ నాయుడు కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్లలేదా ? అని ప్రశ్నించారు. నేడు టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఉసిగొల్పి హరిహరన్ ఇంటి ముందు ధర్నా చేయించారని ఆరోపించారు. ధర్నా చేస్తున్న వారిలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తనకు ద్రోహం చేసి మరో పార్టికి పనిచేసిన వారు ఎందరున్నారో తనకు తెలుసన్నారు. ధర్నాచేస్తున్న వారిని అక్కడి నుంచి పంపకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement