‘తెలుగు ద్రోహుల పార్టీగా మిగిలిపోతుంది’ | MLA Roja Slams TDP Calls It As Telugu Drohula Party | Sakshi
Sakshi News home page

‘తెలుగు ద్రోహుల పార్టీగా మిగిలిపోతుంది’

Published Fri, Apr 6 2018 12:29 PM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

MLA Roja Slams TDP Calls It As Telugu Drohula Party - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను నిలువునా మోసిగించిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తెలుగు ద్రోహుల పార్టీగా మిగిలిపోతుందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారని చెప్పారు. పార్లమెంటు సాక్షిగా హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని వాపోయారు.

ఏదో పొడిచేస్తానని ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ పరువు తీశారని మండిపడ్డారు. ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం రోడ్లపైకి వచ్చినా టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయారా? అని నిలదీశారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement