
సెల్వమణి (ఫైల్ ఫోటో)
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా భర్త సెల్వమణి సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన తొలిసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వైఎస్సార్‌సీపీ శనివారం నగరిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి చంద్రబాబుకు సిగ్గు, శరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఒకప్పటి చంద్రబాబుకి, ఇప్పటి చంద్రబాబుకి చాలా తేడా ఉందని, నమ్మక ద్రోహిగా ఆయనను వర్ణించారు. 2004లో చంద్రబాబును అభిమానించానని, కానీ 2014లో ఆయన అసలు స్వభావం తెలిసి అసహించుకున్నానని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా..
ప్రజలకు సేవచేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. సభలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని అన్నారు. దొంగలు, రౌడీలు, జన్మభూమి కమిటీలో సభ్యులుగా ఉన్నారని.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా మై ఎమ్మెల్యే యాప్‌ను రోజా ప్రారంభించారు. తాను చేసిన అభివృద్ధి ఏంటో ఈ యాప్ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవచ్చని రోజా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment