Selvamani
-
నిన్ను వదిలిపెట్టను బండారు సత్యనారాయణ అని మండి పడుతున్న సెల్వమణి
-
భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా.. వీడియో వైరల్
MLA Roja Playing Kabaddi Video: నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో ‘స్పోర్ట్స్ మీట్’ నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 నుంచి 16 వరకు కొనసాగే ఈ క్రీడా పోటీలను సోమవారం రోజా దంపతులు ప్రారంభించారు. చదవండి: నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్: సీఎం జగన్ ఈ సందర్భంగా టాస్ వేసి కూతకు జట్టును ఎంపిక చేశారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ సరదాగా కాసేపు కబడ్డీ ఆడారు. సెల్వమణి, రోజా రెండు జట్లుగా విడిపోయి ఆటగాళ్లతో కలిసి హుషారుగా కబడ్డీ ఆడారు. కోర్టులోకి దిగి కూత పెట్టడానికి వెళ్లిన రోజాను ఔట్ చేయడానికి భర్త సెల్వమణి ప్రయత్నించగా విఫలమయ్యారు. అనంతరం సెల్వమణి కూడా కూతకు వెళ్లినా ఆయనను రోజాతో పాటు ఇతర క్రీడాకారులు ఔట్ చేయలేకపోయారు. సరదాగా రోజా కబడ్డీ ఆడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చదవండి: AP Formation Day: ఏపీ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు -
భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా
-
కొడుకుతో రోజా డ్యాన్స్.. వీడియో వైరల్
పర్సనల్ లైఫ్‌ను ప్రొఫెషనల్ లైఫ్‌తో అస్సలు పోల్చరు నటి, ఎమ్మెల్యే ఆర్కే రోజా. రాజకీయాల్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. వరుస షూటింగ్స్‌లో బిజీగా ఉన్నా కూడా కుటుంబంతో పాటు గడపాల్సిన సమయాన్ని వాళ్ల కోసం ఇచ్చేస్తారు. దేని టైమ్ దానిదే అంటారు. కుటుంబంలో జరిగిన ఏ చిన్న వేడుకకైనా రోజా హాజరవుతారు. స్వయంగా వంటలు చేసి భర్త, పిల్లలకి వడ్డిస్తారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. కుటుంబంతో కలిసి విదేశాలకు షికార్లకు వెళ్తుంటారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక జూన్ 27న కొడుకు కౌశిక్ బర్త్‌డేని హార్స్లీ హిల్స్ లోగ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు రోజా. భర్త సెల్వమణి, కూతురుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడుకుతో రోజా డాన్స్ చేశారు. దానికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుతో ప్రేమికుడు సినిమాలోని ‘ఊర్వసి’పాటకు కొడుకుతో కాలు కదిపారు రోజా. పాటకు తగినట్లుగా సింపుల్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీశారు. ఎంతైనా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కదా.. ఆ మాత్రం డ్యాన్స్ చేయాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. -
ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రెండు మేజర్ శస్త్రచికిత్సలు
సాక్షి, చెన్నై: ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు మేజర్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. వివరాలను రోజా భర్త ఆర్కే సెల్వమణి ‘సాక్షి’కి చెప్పారు. గతేడాదే ఆపరేషన్ చేయాల్సి ఉండగా కరోనా తీవ్రత కారణంగా వాయిదా వేసుకున్నారు. జనరల్ చెకప్ కోసం ఈ నెల 24న ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించి వెంటనే శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలు పూర్తయ్యాక ఆపరేషన్ తేదీ నిర్ణయించాలని వైద్యులను కోరినా వారు వినలేదని సెల్వమణి చెప్పారు. కాగా, అదే రోజు రోజాకు రెండు మేజర్ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఏడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం రోజా కోలుకుంటున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా సందర్శకులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు. చదవండి: ఆ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు -
కట్ చెప్పలేదు.. కట్టేసుకున్నారు..!
(వెబ్ స్పెషల్): ఇంటర్వ్యూల్లో చాలా మంది హీరోయిన్లు చెప్పే మాట తాము డైరెక్టర్స్ చాయిస్ అని. అంటే.. దర్శకులు చెప్పినట్లు తాము చేస్తామని అర్థం. కొన్ని కొన్ని సార్లు ఈ చెప్పే వారి మాటలు అవతలి వారి మనసును తాకుతాయి. దాంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ కలుగుతాయి. అది కాస్త పెళ్లికి దారి తీస్తుంది. దాంతో కట్ చెప్పలేక వారితో జీవితాన్ని ముడి వేసుకున్నారు. హీరోయిన్లు దర్శకులను వివాహం చేసుకోవడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. మరి ఇంతకు ఏ హీరోయిన్ ఏ దర్శకుడిని పరిణయం ఆడిందో చూడండి.. సుహాసిని-మణిరత్నం హీరోయిన్, దర్శకుల వివాహం టాపిక్ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది సుహాసిని-మణిరత్నంల పేర్లే. ఆమె అందం, అభినయాల కలబోత అయితే.. ఆయన భారతీయ ఆత్మను ప్రతిబింబించే చిత్రాల దర్శకుడు. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి 1988లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. దివంగత దర్శకుడు కె. బాలచందర్ ఒత్తిడి మేరకే తాము వివాహం చేసుకున్నామంటారు సుహాసిని. వీరికి ఒక కుమారుడు నందన్ ఉన్నాడు. (చదవండి: పెద్దన్నయ్య) రేవతి - సురేష్ చంద్ర సురేష్ చంద్ర దర్శత్వంలో రేవతి రెండు చిత్రాల్లో నటించారు. అలా ఏర్పడ్డ పరిచయంతో ఈ జంట ప్రేమలో పడ్డారు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. కృష్ణవంశీ - రమ్య కృష్ణ కృష్ణవంశీ తెరకెక్కించిన చంద్రలేఖ చిత్రంలో రమ్యకృష్ణ నటించారు. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు రిత్విక్ ఉన్నాడు. రోజా - సెల్వమణి రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది సెల్వమణి. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 2002లో రోజా, సెల్వమణిలు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు, పాప ఉన్నారు. శరణ్య-పొన్నవనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు శరణ్య. కానీ 1980-90ల కాలంలో ఈమె చాలా తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేశారు. అప్పుడే దర్శకుడు పొన్నవనన్తో ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు.(చదవండి:ఇదే నాకు పెద్ద బర్త్‌డే గిఫ్ట్ ) ఖుష్బూ-సుందర్ ఇద్దరు కలిసి ఒక్క చిత్రం కూడా చేయలేదు. కన్నడ నిర్మాత అయిన సుందర్‌ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఖుష్బూ. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. వారి పేరు అవంతిక అనందిత. సీత- పార్థిపన్ సీనియర్ నటి సీత, దర్శకుడు పార్థిపన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమర్తెలు, ఓ దత్తత తీసుకున్న కొడుకు ఉన్నారు. 2001లో ఈ జంట విడాకులతో విడిపోయారు. ఆ తర్వాత సీత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. (చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే..) దేవయాని- రాజ్ కుమారన్ దర్శకుడు రాజ్ కుమారన్, దేవయానిల లవ్ ఎఫైర్ అప్పట్లో ఒక సెన్సేషన్. రాజ్ కుమారన్ దర్శత్వంలో దేవయాని నీ వరువై ఏనా అనే చిత్రంలో నటించారు. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. అమలాపాల్ - విజయ్ దర్శకుడు అమలాపాల్, విజయ్ ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. వీరే కాక దర్శకుడు సెల్వ రాఘన్, హరి, ప్రియ దర్శన్ వంటి వారు హీరోయిన్లనే వివాహం చేసుకున్నారు. -
చంద్రబాబుపై రోజా భర్త సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చిత్తూరు : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త సెల్వమణి సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన తొలిసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ శనివారం నగరిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి చంద్రబాబుకు సిగ్గు, శరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఒకప్పటి చంద్రబాబుకి, ఇప్పటి చంద్రబాబుకి చాలా తేడా ఉందని, నమ్మక ద్రోహిగా ఆయనను వర్ణించారు. 2004లో చంద్రబాబును అభిమానించానని, కానీ 2014లో ఆయన అసలు స్వభావం తెలిసి అసహించుకున్నానని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా.. ప్రజలకు సేవచేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. సభలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని అన్నారు. దొంగలు, రౌడీలు, జన్మభూమి కమిటీలో సభ్యులుగా ఉన్నారని.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా మై ఎమ్మెల్యే యాప్‌ను రోజా ప్రారంభించారు. తాను చేసిన అభివృద్ధి ఏంటో ఈ యాప్ ద్వారా ప్రజలందరూ తెలుసుకోవచ్చని రోజా తెలిపారు. -
వీరప్పన్‌కు తొలి వెండితెర జవాబు
అడవిలోని బందిపోట్లు ఆలివ్ గ్రీన్ డ్రస్‌లో మెడకు తూటాల పట్టీ వేలాడ దీసుకుని బుర్ర మీసాలతో ఉంటారని వీరప్పన్ కథ వల్ల మనకు తెలిసింది. కాని అడవి బయట ఉండే బందిపోట్లు తెల్ల చొక్కా తెల్ల పంచె కట్టుకుని భుజాన కండువాతో వేదికలెక్కి ఉపన్యాసాలిస్తుంటారని కూడా వీరప్పన్ కథ మనకు చెప్పింది. వీరప్పన్ దోచుకుంది కొంత. బయట అతని వల్ల దోచుకోబడింది కొండంత. ప్రభుత్వానికి ప్రభుత్వమే విలన్ అయితే ఎటువంటి విలన్స్ ఉబికి వస్తారనడానికి కూడా వీరప్పన్ కథ ఒక ఉదాహరణే. వీరప్పన్ తన పదిహేడవ ఏట మొదటి హత్య చేశాడు. దంతాల కోసం ఏనుగులను చంపుతున్నప్పుడు వాటిని అంకుశంతో బెదిరించవచ్చని అతడు గ్రహించాడు. కాని ‘భయం’ అనే అంకుశం ధరిస్తే ఏ మనిషి అయినా బెదిరిపోక తప్పదని కూడా గ్రహించాడు. డబ్బు సులభంగా రాదని డబ్బుకు వాటాదారులు ఎక్కువని కూడా అతడికి తెలుసు. వ్యవస్థకు ఎదురెళ్లాలంటే వ్యవస్థను లొంగదీసుకోవాలని కూడా తెలుసు. రెండు రాష్ట్రాలు... కర్నాటక, తమిళనాడు... వాటి సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో రెండు రాష్ట్రాల వ్యవస్థలను లొంగదీసుకుని సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు వీరప్పన్. నిజాయితీ ఉన్న అధికారి తన ప్రథమ శత్రువు అని తలచినవాడు. తెలుగు ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని ఈ కథకు ఒక ఉత్తమ ఆఫీసర్ బలి కావడం వల్ల కూడా తెలుగువారికి వీరప్పన్ విలన్ అయ్యాడు. వీరప్పన్‌ను మొదటగా అరెస్ట్ చేసిన ఒకే ఒక ఆఫీసర్– తెలుగువాడు– పందిళ్లపల్లి శ్రీనివాస్– వీరప్పన్‌కు పీడకలగా అవతరించాడు. అతణ్ణి 1986లో ఫారెస్ట్ ఆఫీసులో బంధించి విచారణ జరుపుతుండగా వీరప్పన్ తప్పించుకున్నాడు. అయినా శ్రీనివాస్ అతణ్ణి వదల్లేదు. ఉక్కిరిబిక్కిరి అయిన వీరప్పన్ 1991లో లొంగిపోతున్నానని కబురు పంపాడు. నిరాయుధంగా వస్తే లొంగిపోతానని చెప్పాడు. శ్రీనివాస్ అది నమ్మి వెళ్లి వీరప్పన్ చేతిలో హతమయ్యాడు. బొమ్మ ఒక్కటే ఉండదు. బొరుసు కూడా ఒక్కలాగే ఉండవు. వీరప్పన్‌కు క్రూరమైన వ్యక్తిత్వం ఉన్నట్టే మానవీయమైన వ్యక్తిత్వం కూడా వెతికే వారు ఉన్నారు. అది కనిపించవచ్చు కూడా. అయినప్పటికీ అతడు సంఘవ్యతిరేక శక్తి. సంఘానికి బెడదగా మారిన వ్యక్తి. అలాంటి వారు చట్టాన్నే కాదు కళలను కూడా ఆకర్షిస్తారు. వీరప్పన్‌ను అలా మొదటిసారి ఒక కమర్షియల్ సినిమాలోకి పట్టుకొచ్చిన సినిమా ‘కెప్టెన్ ప్రభాకర్’. దర్శకుడు మణివణ్ణన్‌కు శిష్యుడైన ఆర్.కె. సెల్వమణి సమకాలీన ఘటనల నుంచి కథలను రాసుకోవడంలో సిద్ధహస్తుడు. అతడి తొలి సినిమా ‘పోలీస్ విచారణ’ మద్రాసులో సీరియల్ కిల్లర్‌గా ఖ్యాతి చెందిన ‘ఆటో శంకర్’ జీవితం ఆధారంగా రాసుకున్న కథ. పెద్ద హిట్ అయిన ఈ సినిమాకు హీరో విజయ్‌కాంత్. ఈ సినిమా హిట్ కావడంతో దానిని నిర్మించిన ఇబ్రాహీమ్ రౌతర్ తదుపరి సినిమా కూడా సెల్వమణికే ఇచ్చాడు. హీరోగా మళ్లీ విజయ్కాంత్నే తీసుకున్నాడు. ఈసారి సెల్వమణి అప్పుడు విస్తృతంగా వార్తల్లో ఉన్న వీరప్పన్ పాత్రను తీసుకుని ‘కెప్టెన్ ప్రభాకర్’ కథ రాసుకున్నాడు. సినిమాలో వీరప్పన్ పట్టుబడతాడు. కాని వీరప్పన్ కథ ముగియడానికి ఈ సినిమా రిలీజైన 13 ఏళ్లు పట్టింది. గంధపు చెట్లు నరకడం, ఏనుగు దంతాలు సేకరించడం అడవిలో కష్టం కాదు. వాటిని రవాణా చేయడమే కష్టం. లారీలు చీమలు కావు చాటుగా వెళ్లడానికి. భారీ లారీల్లో గంధపు చెక్కలు రవాణా కావాలంటే దారుల వెంట ఉన్న చెక్‌పోస్ట్‌లు ‘ధారాళంగా’ ఉండాలి. ఆఫీసర్లు ఉదారంగా ఉండాలి. వారిపై అజమాయిషీ చేసే ఆఫీసర్లు, వారిని పోస్ట్ చేసే మంత్రులు కూడా ఉదారంగా ఉండాలి. తద్వారా లాభాన్ని పంచుకోవాలి. ఈ వ్యవస్థ ఇలా స్థిరపడి ఉండటం ఈ సినిమాలో చూపిస్తాడు. వీరప్పన్‌కు మద్దతుగా సినిమాలో స్థానిక ఎం.ఎల్.ఏ, కలెక్టర్, పోలీస్ కమిషనర్ పని చేస్తుంటారు. విజయ్‌కాంత్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా వచ్చేంతవరకు వీరప్పన్ ఊపుకు అడ్డే ఉండదు. విజయ్‌కాంత్ అతణ్ణి నిరోధించగలుగుతాడు. అయితే అడవిలో ఎక్కువ సేపు కథను నడపలేమని దర్శకునికి తెలుసు. అందుకే ఫస్టాఫ్‌లో సిటీలోనే కొంత కథను నడుపుతాడు. విజయ్‌కాంత్ పాత్రను గొప్పగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అలాగే వీరప్పన్ పాత్రను కూడా. అడవిలోని వాతావరణం, గ్రామాల ప్రజలు, వీరప్పన్ బంధువర్గంలో అతడికి ఉండే విరోధులు, వాళ్ల పాత పగలు... ఇవన్నీ సినిమాలో అంతర్భాగం అవుతాయి. విజయ్‌కాంత్‌ను కేవలం ఒక ఆఫీసర్‌గా మాత్రమే చూపకుండా గృహస్తునిగా, భార్యా బిడ్డలతో, తల్లితో అనుబంధం ఉన్నవాడిగా కూడా చూపడం వల్ల స్త్రీల ప్రమేయం ఉన్న కథగా కూడా మారి మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాధారణంగా సినిమాల్లో విలన్ల జోలికి పోలీసాఫీసరైన హీరో వెళితే అతడి కుటుంబం కష్టాల్లో పడుతుంటుంది. అది జోకనుకుంటాం. కాని ఇక్కడ నిజంగానే వీరప్పన్‌తో పెట్టుకుంటే అందరికీ ప్రమాదం వస్తుంది. కిడ్నాప్‌లకు మారుపేరైన వీరప్పన్ ఈ సినిమాలో కూడా విజయ్‌కాంత్ భార్యాబిడ్డల్ని కిడ్నాప్ చేస్తాడు. వాళ్లను విడిపించుకోవడమే క్లయిమాక్స్. తీరా వీరప్పన్‌ను పట్టుకుని ప్రభుత్వానికి అప్పజెప్తున్న సమయంలో అతడి ద్వారా తమ రహస్యాలు బయటపడతాయనుకున్న పెద్దలు అతణ్ణి షూట్ చేసి చంపేస్తారు. విజయ్‌కాంత్ ఆ పెద్దలను కూడా చంపి కోర్టులో సుదీర్ఘ వాదన చేసి బయటపడతాడు. ఇది కొంత వాస్తవ దూరంగా ఉన్నా సినిమాగా చూస్తున్నప్పుడు సరే అని అనిపిస్తుంది. కెప్టెన్ ప్రభాకర్ పెద్ద తెర మీద చూడాల్సిన, జనం చూసి మెచ్చిన సినిమా. కథ వల్ల, నేప«థ్యం వల్ల, దర్శకుడి ప్రతిభ వల్ల కూడా ఈ సినిమా రక్తి కట్టింది. అన్నింటికీ మించి వీరప్పన్ అనే పాత్ర వల్ల ఇది ఆకర్షవంతమైంది.ఈ సినిమా తర్వాత వీరప్పన్ మీద అనేక సినిమాలు వచ్చాయి. కాని కెప్టెన్ ప్రభాకర్ మాత్రం ఆ సినిమాలన్నింటిలో కెప్టెన్లాంటిది. నిజాయితీ నిండిన పోలీసాఫీసర్లకు సెల్యూట్లాంటిది. సెల్యూట్. కెప్టెన్ ప్రభాకరన్ సెల్వమణి దర్శకత్వంలో 1991లో తమిళంలో విడుదలైన ‘కెప్టెన్ ప్రభాకరన్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘కెప్టెన్ ప్రభాకర్’గా విడుదలై అంతే విజయం సాధించింది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచింది. అప్పట్లో తమిళపులి ‘ప్రభాకర్’కు తమిళనాట ఉన్న ఆదరణ కారణంగా హీరోకు ప్రభాకర్ అనే పేరు పెట్టారు. సాధారణంగా నూరో సినిమాలు అచ్చిరావనే అపప్రద తమిళంలో ఉంది. కానీ విజయ్‌కాంత్ నూరవ సినిమా అయిన ‘కెప్టెన్ ప్రభాకరన్’ బ్రహ్మాండమైన హిట్ అయ్యి విజయ్‌కాంత్‌కు ‘కెప్టెన్’ అనే ముద్దుపేరును సంపాదించి పెట్టింది. కేరళలోని ‘చాలకుడి’ ప్రాంతంలో అడవుల వెంట తీసిన ఈ సినిమా నిజంగానే గాఢమైన అడవుల్లో వీరప్పన్ కోసం వేట సాగిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమాతో ‘మన్సూర్ అలీఖాన్’ విలన్‌గా తమిళంలో పెద్ద గుర్తింపు పొందాడు. రాజీవ్‌గాంధీ హత్య కేసు మీద ‘కుట్రపత్రికై’ తీసి సెన్సార్ కోరల్లో 14 ఏళ్ల పాటు చిక్కుకున్న సెల్వమణి కాలక్రమంలో ‘చామంతి’, ‘సమరం’ వంటి సినిమాలు తీసి నటి రోజా భర్తగా తెలుగువారి అల్లుడయ్యాడు. ఇక నటుడుగా, రాజకీయ నాయకునిగా విజయ్‌కాంత్ ప్రస్తుత పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. అతడికి మరో కెప్టెన్ ప్రభాకర్ అవసరం అయితే ఉంది. – కె -
రోజా ప్రాణాలకు ముప్పు!
భర్త సెల్వమణి ఆందోళన చెన్నై: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ రాజకీయాల కారణంగా తన భార్య రోజా ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె భర్త, సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో ఇటీవల జరిగిన జాతరలో నియోజకవర్గ ఎమ్మెల్యే హోదాలో ఆర్కే రోజా పాల్గొన్నారు. దేవునికి హారతి ఇచ్చేందుకు రోజా వెళుతుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు అనుచరులు కొందరు ఆమెను అడ్డుకుని కత్తితో గాయపరిచారు. అంతేగాక ఆమె చేతిలోని హారతి పళ్లెంను తోసివేయడంతో కిందపడిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దుందుడుకు చర్యలకు కలత చెందిన రోజా బైఠాయించి నిరసన తెలిపారు. జాతరలో తొలి హారతి తనదే కావాలని రోజా పట్టుపట్టి దేవాలయాల్లో పార్టీ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తూ రోజా దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ చర్యలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించి ముద్దు కృష్ణమనాయుడు దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రోజా దిష్టిబొమ్మ దహనానికి అడ్డుచెప్పని పోలీసులు గాలి దిష్టిబొమ్మను మాత్రం అడ్డుకోవడం ద్వారా అధికార పార్టీ తొత్తులుగా మారారని వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శించింది. ఈ నేపథ్యంలో రోజా భర్త సెల్వమణి గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. దేవుడికిచ్చే హారతిలో మొదటిది, రెండోది అంటూ ఉండదన్నారు. భగవంతుడంటే ఎంతో భక్తిప్రపత్తులు కలిగిన రోజా హారతుల కోసం పాకులాడే స్వభావి కాదని ఆయన అన్నారు. జాతర సమయంలో తనచేతిపై కత్తిగాటు పడినందుకు కూడా ఆమె బాధపడలేదని, హారతి పళ్లెంను తోసివేయడంపైనే తీవ్రంగా కలత చెందారని ఆయన అన్నారు. రోజా ఎంతో ధైర్యశాలి అని, ఇటువంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనగలరని, అయితే ఈ సమయంలో ఆమె ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తాను భయపడుతున్నట్లు సెల్వమణి చెప్పారు. **