
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా(ఫైల్‌ఫొటో)
సాక్షి, చెన్నై: ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు మేజర్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. వివరాలను రోజా భర్త ఆర్కే సెల్వమణి ‘సాక్షి’కి చెప్పారు. గతేడాదే ఆపరేషన్ చేయాల్సి ఉండగా కరోనా తీవ్రత కారణంగా వాయిదా వేసుకున్నారు. జనరల్ చెకప్ కోసం ఈ నెల 24న ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించి వెంటనే శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలు పూర్తయ్యాక ఆపరేషన్ తేదీ నిర్ణయించాలని వైద్యులను కోరినా వారు వినలేదని సెల్వమణి చెప్పారు. కాగా, అదే రోజు రోజాకు రెండు మేజర్ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఏడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం రోజా కోలుకుంటున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా సందర్శకులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment