Viral Video: MLA Roja Plays Kabaddi With Her Husband Selvamani | Roja Latest Videos - Sakshi
Sakshi News home page

MLA RK Roja: భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా.. వీడియో వైరల్‌

Published Mon, Nov 1 2021 12:55 PM | Last Updated on Tue, Nov 2 2021 11:48 AM

Viral Video: MLA Roja Plays Kabaddi With Her Husband Selvamani - Sakshi

MLA Roja Playing Kabaddi Video: నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్‌ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో ‘స్పోర్ట్స్‌ మీట్‌’ నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1 నుంచి 16 వరకు కొనసాగే ఈ క్రీడా పోటీలను సోమవారం రోజా దంపతులు ప్రారంభించారు.
చదవండి: నేలపై ఉండి ఆకాశమంత ఎదిగిన వ్యక్తి వైఎస్సార్‌: సీఎం జగన్‌

ఈ సందర్భంగా టాస్‌ వేసి కూత‌కు జ‌ట్టును ఎంపిక చేశారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ సరదాగా కాసేపు కబడ్డీ ఆడారు. సెల్వమణి, రోజా రెండు జట్లుగా విడిపోయి ఆటగాళ్లతో కలిసి హుషారుగా కబడ్డీ ఆడారు. కోర్టులోకి దిగి కూత పెట్టడానికి వెళ్లిన రోజాను ఔట్ చేయ‌డానికి భ‌ర్త సెల్వ‌మ‌ణి ప్ర‌య‌త్నించ‌గా విఫలమయ్యారు. అనంత‌రం సెల్వమణి కూడా కూత‌కు వెళ్లినా ఆయనను రోజాతో పాటు ఇతర క్రీడాకారులు ఔట్ చేయ‌లేక‌పోయారు. సరదాగా రోజా కబడ్డీ ఆడిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.
చదవండి: AP Formation Day: ఏపీ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement