తమిళనాడు క్రిమినల్స్‌తో ముద్దుకృష్ణమనాయుడు దాడులు
శాంతి భర్త కేజే కుమార్ ఆరోపణ
చెన్నై: టీడీపీ పాలనలో మహిళలకు ఏమాత్రం రక్షణ ఉందో తన సతీమణిపై జరిగిన దాడి ఉదంతమే నిదర్శనమని చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ చైర్‌పర్సన్ కె.శాంతి భర్త కేజే కుమార్ అన్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన శాంతిని సోమవారం మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా శాంతి భర్తకేజే కుమార్ సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. మునిసిపల్ పరిధిలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు చైర్‌పర్సన్‌కు ఉంటుందనే విచక్షణను మరిచిన ముద్దు కృష్ణమనాయుడు తమపై దాష్టీకానికి పూనుకున్నారన్నారు. దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన అమృత్‌రాజ్ తమిళనాడుకు చెందిన నేరస్తుడన్నారు. బియ్యం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ తమిళనాడు పోలీసుల రికార్డుల్లో పీడీ యాక్టుకు గురై ఏడాదిపాటూ అమృతరాజ్ పుళల్‌లో జైలు జీవితం గడిపాడని చెప్పారు. అతని సోదరుడు మైఖేల్‌రాజ్ నకిలీ మద్యం తయారీలో నిందితుడని చెప్పారు.
అమృత్‌రాజ్ ఏడాదిపాటూ పుళల్‌లో జైలు జీవితం గడిపి బయటకు రాగా ఇంకా కేసు విచారణలో ఉందని అన్నారు. తమిళనాడు పోలీసుల కళ్లుగప్పి ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకుని ఉన్న నేరస్తులను గాలి ముద్దుకృష్ణమనాయుడు చేరదీశారని ఆరోపించారు. స్థానిక ప్రజల్లోనే కాదు, ప్రతిపక్షాల్లో సైతం తమకు మంచిపేరున్న కారణంగా దాడుల కోసం తమిళనాడు గూండాలపై ఆయన ఆధారపడాల్సి వచ్చిందని విమర్శించారు. ఫోన్ ద్వారా పరామర్శించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
దేశం పాలనలో రక్షణ కరువు
Published Tue, Jul 5 2016 8:08 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement