ముద్దుకృష్ణమా.. జాగ్రత్త... | ysrcp mla roja slams muddukrishnama naidu | Sakshi
Sakshi News home page

ముద్దుకృష్ణమా.. జాగ్రత్త...

Published Fri, Aug 21 2015 9:11 AM | Last Updated on Tue, May 29 2018 3:49 PM

ముద్దుకృష్ణమా.. జాగ్రత్త... - Sakshi

ముద్దుకృష్ణమా.. జాగ్రత్త...

తిరుపతి : ''ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతున్నందుకు, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు ఏదైనా ఉంటే నాతో ఢీ కొట్టాలి. అలా కాకుండా నా అనుచరులను, అమాయకులను వేధిస్తూ, కేసులో బెదిరించాలని చూస్తే వదిలేది లేదు. ముద్దుకృష్ణమా.. జాగ్రత్త. మళ్లీ ఇలాంటివి పునరావృతం చేస్తే ఊరుకోం...''  అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా హెచ్చారించారు.  జిల్లా జైలులో ఉన్న నగరి వైఎస్ఆర్ సీపీ నాయకులు కేజే.కుమార్ తదితరులను ఆమె నిన్న పరామర్శించారు.  

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా అనుచరులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా పక్కదారి పట్టాయని విమర్శించారు. పోలీసులను గుప్పెట్లో ఉంచుకుంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలను ప్రజలంతా చూస్తున్నారన్నారు. నగరి కమిషనర్ అవినీతికి పరాకాష్టని, ఆయన ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పై దాడి చేసిన పోలీసులు తప్పుడు కేసులు బనాయించారన్నారు. ముద్దుకృష్ణమ నాయుడు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తోందని రోజా మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement