సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ దిశగా వైసీపీ అప్రతిహతంగా దూసుకుపోతోంది. సగానికి పైగా సీట్లలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. 150కు పైగా నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రాలు సత్తా చాటుతున్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ, ఇతర పార్టీల తప్పుడు అంచనాలు, లెక్కలకు ధీటుగా ఆమె దూసుకుపోతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై రోజా మెజారిటీతో గెలుపు దిశగా పయనిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపుతోంది. ఏపీ ఫలితాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఫ్యాన్ హవాతో ఎంపీల పరంగా దేశంలోనే అదిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవతరించనుంది.
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడుతుండగా, అధికార పార్టీ మంత్రులు పలువురు వెనుకంజలో ఉండటం గమనార్హం. ఇక జనసేన ప్రభావమే లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment