
సాక్షి, తిరుపతి : నగరి పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద 108,104 అంబులెన్సు వాహనాలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. దీనిలో భాగంగా 108 వాహనాన్ని రోజా స్వయంగా నడిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108,104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1008 అంబులెన్సు సర్వీసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఒకేసారి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment