
చిత్తూరు, విజయపురం: ‘ మీ ఇంటి బిడ్డగా, ఆడపడుచుగా, సోదరిగా ఆదరించి గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను ? ఎప్పటికీ మీ వెంటే ఉంటా. మీ కష్టాలను తీర్చే ప్రతినిధిని అవుతా. నిత్యం అందుబాటులో ఉండాలనే నగరిలో ఇల్లు కట్టుకున్నా’ అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నా రు. గురువారం నగరి పట్టణం సమీపంలోని మం డపం వద్ద నూతన గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
పార్టీలకతీతంగా నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే రోజా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, నారాయణస్వామి, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, మాజీ మంత్రి చెంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment