
సాక్షి, చిత్తూరు : నగరిలో దారుణం చోటుచేసుకుంది. తిరుత్తణి రహదారిలో రామకృష్ణ కాటన్ మిల్లు సమీపంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. నగరి నుండి చెన్నైకి వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులో ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో సెలవు ప్రకటించారు. ఈ సందర్భంగా వీరంతా కారులో విహార యాత్రకు వెళ్లినట్టు తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన సంభవించింది.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు తిరువళ్లూర్‌లోని పోరూర్‌కు చెందినవారుగా తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఏంజిల్(24) మృతి చెందగా..నగరి ఆస్పత్రిలో చికిత్స పొందుతు ప్రేమ్ (25), ప్రితీక్ రాజు (19) మృతి చెందారు. గాయపడిన ధీరజ్ రాజ్ (19), చర్య (23) జనిల్ (22) ముగ్గురు తిరుత్తణి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment