
సాక్షి, చిత్తూరు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారానికి 64వ రోజుకు చేరింది. ఇవాళ ఉదయం ఆయన నగరి నియోజకవర్గం పాదిరేడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. తాడ్నేరి గిరిజన కాలనీ, లక్ష్మమ్మ కండ్రిగ, టీసీ అగ్రహారం, ఆర్‌వీ కండ్రిగ, పెనుమల్లం, పాపనాయుడుపేట, మర్రిమండ బీసీ కాలనీ మీదగా వికృతమల వరకు యాత్ర కొనసాగనుంది. పాపానాయుడు పేటలో బీసీలతో వైఎస్ జగన్ ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది.