నేటి సాయంత్రం నగరికి రానున‍్న స్టాలిన్
నగరి: డీఎంకే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎం.కె. స్టాలిన్ ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఆదివారం సాయంత్రం నగరి మున్సిపల్ పరిధి ఏకాంబరకుప్పంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇటీవల మృతి చెందిన డీఎంకే పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కేఏ మునస్వామి సంతాప సభకు స్టాలిన్ హాజరవుతారని ఆ పార్టీ రాష్ట్ర నేత కార్మిక సంఘం వ్యవస్థాపకులు వీఈ గంగాధరం తెలిపారు.
(35 ఏళ్ల తర్వాత స్టాలిన్ తప్పుకున్నారు!)
ఈ సభకు డీఎంకే ఆంధ్ర రాష్ట్ర మాజీ అధ్యక్షులు నందగోపాల్ అధ్యక్షత వహిస్తారన్నారు. ఎమ్మెల్యేలు పొన్ముడి, వేణు, వేలు, గాంధీ, రాజేంద్రన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి భారతి, నేత విభాగం ఉపాధ్యక్షులు నాగలింగం తదితరులు పాల్గొంటారన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత స్టాలిన్ మొదటి రాష్ట్రేతర పర్యటన ఇదేకావడం గమనార్హం.
(వారసుడొచ్చాడు)