
రోడ్డు మీద నాటేసిన నిరసన తెలిపిన వైఎస్పార్ ఎమ్మెల్యే ఆర్కే రోజా
చిత్తూరు : రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రభుత్వానికి తెలపడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వినూత్న నిరసన తెలిపారు. మేళపట్టు గ్రామంలో నీటమునిగిన రోడ్డు మీద మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని.. నీళ్లు నిలిచి పోయి కాలువలను తలపిస్తున్నాయని మేళపట్టు గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు రోజా ఇలా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు పాలనలో రహదారులు పరమ అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. కానీ మంత్రి లోకేష్ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గ్రామాలలోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశంలో అనేకసార్లు రోడ్ల దుస్టితి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు. ఈ రోజు రోజా నగరిలో ఓ పెట్రోల్ బంక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నగరి పట్టణం పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా. ఈ సందర్భంగా ఆమె వాహనాలకు పెట్రోల్ పట్టారు.


Comments
Please login to add a commentAdd a comment