
పార్టీ మీకు అండగా ఉంటుంది: వైఎస్ జగన్
తిరుపతి: నగరి మున్సిపల్ చైర్ పర్సన్, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు శాంతకుమారి నివాసంపై పోలీసులు దాడి చేయడాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఘటనపై శాంతకుమారితో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్.. పోలీసుల దాడులను ఎదుర్కొందామని, ధైర్యంగా ఉండాలని ఆమెకు భరోసా ఇచ్చారు.
టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు దౌర్జన్యాలు శృతిమించుతున్నాయని, వాటిని తిప్పికొడదామని ఆమెకు ధైర్యం చెప్పారు. 'మీకు పార్టీ అండగా ఉంటుంది, మీకు నేను అండగా ఉంటా. భయపడాల్సిన అవసరం లేదు' అని శాంతకుమారికి వైఎస్ భరోసా ఇచ్చారు.