
తిరుపతి: గత ఎన్నికల్లో తన మీద నమ్మకంతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిక్కెట్ ఇచ్చారని నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. సోమవారం రోజా తన సొంత నిధులతో నగరిలో వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరి ప్రజలు తనను గెలిపించారని తెలిపారు. నగరి ప్రజల రుణం జీవితంలో మర్చిపోలేనని చెప్పారు.
గత ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో ప్రతిపక్షం మీద కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఏపీ సీఎం కావడం ఖాయం అని జోస్యం చెప్పారు. అప్పుడు అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment