నగరి: చిత్తూరు జిల్లా నగరి అబ్బాయికి చైనా దేశానికి చెందిన అమ్మాయితో ప్రేమ వివాహం జరిగింది. నగరి మున్సిపాలిటీ పరిధి కొత్తపేటకు చెందిన వీఎన్ కృష్ణన్, లత దంపతుల కుమారుడు వీకే పురుషోత్తమన్ బీఈ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి చైనాలోని బెల్జింగ్‌లోని బీఎండబ్ల్యూ గ్రూప్ ఆసియా లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
బెల్జింగ్‌కు చెందిన వాంగ్ డిసెంగ్, యాంగ్ కనియింగ్ దంపతుల కుమార్తె డబ్ల్యూ.మింగ్ మింగ్ అదే కంపెనీలో ఫైనాన్షియల్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ యువతితో కృష్ణన్‌కు పరిచయం ఏర్పడి..అది కాస్తా ప్రేమగా మారింది. తల్లిదండ్రుల సమ్మతితో పెళ్లి చేసుకోవాలని ఇరువురు నిర్ణయించుకుని తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు.
సంప్రదాయ వ్యవహారాల అడ్డు తొలగించుకునే విషయంలో ఇరువురు విజయం సాధించారు. కృష్ణన్ తల్లి, బంధువుల కోరిక మేరకు నగరిలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరపడానికి వధువు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దీంతో చైనా నుంచి నగరికి వచ్చిన అమ్మాయికి వరుని తరఫు వారు హిందూ సంప్రదాయం ప్రకారం నలుగు పెట్టి, చీరకట్టి పెళ్లికూతురిలా ముస్తాబు చేసి స్థానిక ఏజేఎస్ కల్యాణ మండపంలో వివాహం జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment