
నగరి: పట్ణణ పరిధిలో నూతనంగా ప్రారంభించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లక్ష రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంటును ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ఆమె ఆ ప్లాంటును ప్రారంభించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన సమయంలో తాగునీటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చానని, ఆ మేరకు మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. వాటర్ ప్యూరిఫయర్, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు మరుగుదొడ్లు కూడా త్వరలో నిర్మిస్తామన్నారు. ప్రిన్సిపాల్ రఘుపతి, మునిసిపల్ చైర్‌పర్సన్ కే.శాంతి, మాజీ చైర్మన్ కేజే కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment