చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధి ఇంటి వద్ద పోలీసులు జులం ప్రదర్శించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగరి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు శాంతా కుమారి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు ఆమెను అక్రమంగా అరెస్టు చేశారు.