
సాక్షి, చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సహకార రంగంలోని రెండు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరి నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ఆయనను మంగళవారం ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు కలిశారు. చెరకు ఫ్యాక్టరీ మూత వేయడంతో ఉపాధి కోల్పోయామని, 11 వేల మందికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మూతపడిన ఈ ఫ్యాక్టరీలను వైఎస్ రాజశేఖరరెడ్డి తెరిపించారని తెలిపారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైఎస్ జగన్ మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment