
చిత్తూరు ,నగరి: స్విమ్స్ డైరెక్టర్, వైస్ చాన్స్‌లర్ టీఎస్ రవికుమార్, స్విమ్స్ డీడీ డాక్టర్ వెంకటరమణారెడ్డి బుధవారం నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజాను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు కేన్సర్ నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఉమన్ కేన్సర్ ఇనిషియేటివ్ ప్రొగ్రాం, ‘ఇంటిగ్రేటెడ్ ట్రామాకేర్ ఫర్ రాయలసీమ’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుండెపోటుకు గురైతే తీసుకోవాల్సిన చికిత్సపై ఆదిత్య హృదయం పేరుతో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నామని వివరించారు.