చిత్తూరు:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సీమాంధ్రలో పర్యటించే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విమర్శించారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబు..ప్రస్తుతం సీమాంధ్రలో పర్యటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని మంచి చేసుకోవడానికే చంద్రబాబు యాత్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్రలో ఆత్మగౌరవ పేరుతో బాబు బస్సుయాత్ర చేయడాన్ని ఖండించారు. తెలుగు ప్రజలకు స్పష్టమైన వైఖరి వెల్లడించాకే యాత్ర చేయాలన్నారు.
విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపైకొచ్చి సమ్మె చేస్తుంటే చంద్రబాబు మాత్రం వారిని మరోసారి మోసగించేందుకు యాత్రకు సిద్ధమయ్యారంటూ పలువురు నేతలు మండిపడుతున్నారు.