తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు నిద్రపట్టడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. ఆదివారం రాజంపేట లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇటీవల భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటనకు తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెళ్లారు.
ఆ పర్యటనను అడ్డుకోవడం వెనక కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు విజయమ్మ పర్యటనను ఆడ్డుకోవడమే అత్యుత్తమమైన ఉదాహరణ అని ఆయన అమర్నాథరెడ్డి పేర్కొన్నారు.