
సాక్షి, ఇడుపులపాయ : ప్రజల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు పాదయాత్రను మొదలుపెట్టిన గొప్పవ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని కడప జిల్లా అధ్యక్షులు అమర్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆ మహానేత అడుగుజాడల్లోనే ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. జనసంద్రమైన ఇడుపులపాయ బహిరంగసభలో అమర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ప్రజల నేత వైఎస్ జగన్ తలపెట్టిన పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన అందరికీ పేరుపేరునా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
‘పాదయాత్ర చేపట్టి ప్రతిపక్షనేతగా ప్రజల సమస్యల్ని తెలుసుకున్న మహానేత వైఎస్ఆర్ సీఎం కాగానే ఆ మాట నెలబెట్టుకున్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను పరిష్కరించే ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్ర ప్రజల కష్టాలను దూరం చేసిన గొప్పవ్యక్తి వైఎస్ఆర్. ప్రస్తుతం ఏపీలో ఏం జరగుతోంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు 600కు పైగా హామీలు ఇచ్చారు. కానీ సీఎం కుర్చీలో కూర్చుని మూడున్నరేళ్లు గడుస్తున్నా.. చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. తమ సమస్యలు తీరాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆయనదే విజయమని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఈ ప్రజా సంకల్ప పాదయాత్రకు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. మీ తరఫున పోరాటం చేసేందుకు ప్రతిష్టాత్మక పాదయాత్రతో నడుం బిగించి, కోట్లాది ప్రజలతో మాట్లాడి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తానన్న వైఎస్ జగన్‌కు మద్ధతు తెలపాలని’ ఏపీ ప్రజలకు అమర్‌నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment