
అందమైన ప్రేమకథ
ఓ పల్లెటూరిలో జరిగే ప్రేమకథ నేపథ్యంలో ఎన్. రామవర్థన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గుప్పెడు గుండెను తడితే..’. బసవన్, మైనా జంటగా ఏపీ హనుమంతరెడ్డి నిర్మించారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని తూదొడ్డి గ్రామంలో ఈ చిత్రం షూటింగ్ చేశామనీ, ఇది మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని నిర్మాత తెలిపారు. ఇదొక అందమైన ప్రేమకథ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య, కెమెరా: ఆనమ్ వెంకట్, సమర్పణ: పంచలింగాల అమర్‌నాథ్‌రెడ్డి.